Balakrishna Boyapati Srinu : BB4.. మాస్ జాతర మొదలు..!

Balakrishna Boyapati Srinu నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటివరకు 3 సినిమాలు రాగా 3 సినిమాలు సూపర్ హిట్

  • Written By:
  • Publish Date - June 10, 2024 / 10:50 AM IST

Balakrishna Boyapati Srinu నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటివరకు 3 సినిమాలు రాగా 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో 4వ సినిమా మొదలవుతుంది. బాలయ్య, బోయపాటి నాల్గవ సినిమాగా BB4 ఎనౌన్స్ మెంట్ వచ్చింది. అఖండ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. నేడు బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్ వదిలారు. మా బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ బిబి4 అనౌన్స్ మెంట్ చేశారు.

ఇక ఈ పోస్టర్ చూస్తుంటే ఇది అఖండ సినిమాకు సీక్వెల్ లానే అనిపిస్తుంది. ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ లో రాం ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే బోయపాటి శ్రీను సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

BB4 పోస్టర్ చూస్తుంటే అఖండ తరహా డివోషనల్ టచ్ ఉన్న కథతోనే ఈ సినిమా చేస్తున్నాడని అనిపిస్తుంది. BB4 పోస్టర్ తోనే మాస్ జాతర కన్ఫర్మ్ అని చూపించాడు బోయపాటి. మరి ఈ సినిమా వారిద్దరి కాంబినేషన్ కు డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతుందేమో చూడాలి. ఈ సినిమాను శ్రీరక స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ కలిసి నిర్మిస్తున్నాయి.

Also Read : Samantha : పుష్ప సాంగ్ సమంత వారు వద్దన్నా కూడా చేసిందా..?