Site icon HashtagU Telugu

Akhanda 2 Heroine : అఖండ 2లో ఆ హీరోయిన్ ఛాన్స్..?

Akhanda 2

Akhanda 2

Akhanda 2 Heroine బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సీక్వెల్ ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. బోయపాటి శ్రీను ఇప్పటికే స్టోరీ ఫైనల్ చేయగా బాలయ్య డేట్స్ ఇవ్వడమే ఆలస్యం సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అఖండ సినిమాకు కొనసాగింపుగానే ఉన్నా కథ కొత్తగా ఉంటుందని టాక్. అయితే అఖండ లో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించగా అఖండ 2 లో కొత్త హీరోయిన్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖండ 2 లో భూమిక హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ఒకప్పుడు స్టార్ హీరోలతో జత కట్టి అప్పటి యువత హృదయాలను కొల్లగొట్టిన భూమిక ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఈసారి ఆమెను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫిక్స్ చేశారు. అయితే అఖండ 2 సినిమాలో మిడిల్ ఏజ్ రోల్ లో భూమిక నటిస్తుంది.

కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో బాలకృష్ణతో నటించే ఛాన్స్ రాలేదు కానీ ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ రాగానే వెంటనే మరో నిమిషం ఆలోచించకుండా భూమిక ఓకే చేసిందట. ఆల్రెడీ అబ్బాయి ఎన్.టి.ఆర్ తో ఆడి పాడిన భూమిక ఈసారి బాబాయ్ తో జత కడుతుంది. ఈ సినిమాలో భూమిక పాత్ర కూడా ఆమె ఫ్యాన్స్ ని అలరించేలా ఉంటుందని తెలుస్తుంది.

Also Read : Kavya Kalyanram : బలగం కావ్యాకి మెగా ఆఫర్.. లక్ మామూలుగా లేదుగా..!