Bhagavanth Kesari Business : భగవంత్ కేసరి టార్గెట్ ఫిక్స్.. బిజినెస్ డీటైల్స్ ఇవే..!

Bhagavanth Kesari Business నందమూరి బాలకృష్ణ అనీల్ రావిపుడి కాంబోలో వస్తున్న భగవంత్ కేసరి సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు

Published By: HashtagU Telugu Desk
Balakrishna Bhagavanth Kesari Target Fix Worldwide Business Details

Balakrishna Bhagavanth Kesari Target Fix Worldwide Business Details

Bhagavanth Kesari Business నందమూరి బాలకృష్ణ అనీల్ రావిపుడి కాంబోలో వస్తున్న భగవంత్ కేసరి సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాగు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటించగా సినిమాలో శ్రీ లీల (Sri Leela) బాలకృష్ణ గారాల పట్టిగా నటించింది. సినిమాలో మాస్ అంశాలతో పాటుగా ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ ని అలరిస్తాయని అన్నారు.

ఈ నెల 19న దసరా కానుకగా రిలీజ్ అవుతున్న భగవంత్ కేసరి సినిమా థియేట్రికల్ బిజినెస్ చూస్తే బాలయ్య (Balakrishna) కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఏరియాల వారిగా భగవంత్ కేసరి బిజినెస్ వివరాలు చూస్తే.. నైజాం 12 కోట్లు, సీడెడ్ 12 కోట్లు, ఆంధ్రా 29 కోట్లు ఏపీ తెలంగాణా రెండు రాష్ట్రాల్లో మొత్తం 54.5 కోట్ల బిజినెస్ చేయగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 4 కోట్లు ఓవర్సీస్ 6 కోట్లు బిజినెస్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమా 64.5 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 65 కోట్ల పైన రాబట్టాల్సి ఉంటుంది. అనీల్ మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటుగా నందమూరి ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు. ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారని తెలుస్తుంది.

Also Read : Natural Star Nani : నాని కెరీర్ బెస్ట్ రెమ్యునరేషన్..!

  Last Updated: 17 Oct 2023, 02:59 PM IST