నందమూరి బాలకృష్ణ (Balakrishna), శ్రీలీల (Sreeleela), కాజల్ (Kajal) ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ భగవంత్ కేసరి (Bhagavanth Kesari). అఖండ , వీర సింహ రెడ్డి హిట్స్ తర్వాత బాలకృష్ణ నుండి వస్తున్న సినిమా కావడం..వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి డైరెక్టర్ అవ్వడం..ముఖ్యంగా యూత్ కలల రాణి శ్రీ లీల బాలకృష్ణ కు కూతురుగా నటించడం తో ఈ సినిమా ఫై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? కూతురు సెంటి మెంట్ ఎంత వరకు వర్క్ అవుట్ అయ్యింది..? థమన్ మ్యూజిక్ ఎలా ఉంది..? బాలకృష్ణ ను అనిల్ ఎలా చుపించాడనేది ఆడియన్స్ టాక్ (Bhagavanth Kesari Talk) లో తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర చోట్లా సినిమా మొదటి షో పూర్తి అయ్యింది. విదేశాల్లో అర్ధరాత్రే ప్రీమియర్స్ పడడంతో సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వస్తుంది. చాల ఏళ్ల తర్వాత బాలయ్య నుండి సెంటిమెంట్ ఫిలిం చూశామని చెపుతున్నారు. ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ సినిమా చూడాల్సిందే అని చెపుతున్నారు.
ఫస్ట్ హాఫ్‌లో కాజల్ అగర్వాల్ 15 నిమిషాల పాటు సైడ్ రోల్ చేసింది. ఇంటర్వెల్ మాత్రం మైండ్ బ్లాక్.. హిట్ బొమ్మ. ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు.. ఈ మూవీలో బాలకృష్ణను చాలా డిఫరెంట్‌గా చూస్తారు. కోకో కోలా పెప్సీ.. భగవంత్ కేసరి సెక్సీ ..అంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ‘అఖండ’ సినిమాకు థమన్ ఇచ్చిన బీజీఎం ఎంత ప్లస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం సంగీతంపై నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంత బాగోలేదని అంటున్నారు. కాకపోతే యాక్షన్ సీన్స్‌లో థమన్ అదరగొట్టారని కామెంట్లు పెడుతున్నారు. ఓవరాల్ గా నందమూరి అభిమానులకు ఈ సినిమా పెద్ద పండగే అని , మహిళా సంక్షేమం గురించి ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఇచ్చారని. ప్రతి అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి చూడాల్సిన సినిమా అని చెపుతున్నారు. అనిల్ రావిపూడి సినిమాను చక్కగా తెరకెక్కించారని , బాలకృష్ణ ను కొత్తగా చూపించి సక్సెస్ అయ్యారని అంటున్నారు.
Read Also : Thalapathy Vijay : దళపతి విజయ్ ఇంత నిర్లక్ష్యం ఎందుకు..?