Site icon HashtagU Telugu

Balakrishna at Venky Movie Sets : వెంకీ సెట్లో బాలయ్య సందడి..

Venky Balakrishna Anilravip

Venky Balakrishna Anilravip

Balakrishna at Venky Movie Sets : వెంకీ (Venkatesh ) మూవీ సెట్ కు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సడెన్ ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్య పరిచారు. ప్రస్తుతం వెంకటేష్..సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో ముచ్చటగా మూడోసారి వర్క్ చేస్తున్నాడు. గతంలో F2 , F3 చిత్రాల్లో నటించగా..అవి సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమయ్యాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రపీ, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ఈ హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. కాగా ఈ సెట్ కు నందమూరి బాలకృష్ణ వచ్చి ఆశ్చర్య పరిచారు. కాసేపు సెట్ లో సందడి చేసి..సినిమా విశేషాలు , షూటింగ్ తాలూకా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణ , వెంకీ , అనిల్ ముగ్గురు సరదాగా మాట్లాడుకొని , ఫోటోలకు పోజులు ఇచ్చారు. బాలకృష్ణ – అనిల్ రావిపూరి కలయిక లో భగవత్ కేసరి మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యి బాలయ్య ఖాతాలో విజయం వరించింది. శ్రీలీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురి గా నటించగా..కాజల్ హీరోయిన్ గా నటించింది.

Read Also : Life Lessons : 30 ఏళ్లలోపు ఈ విషయాలు తెలుసుకోండి