Balakrishna with Honey Rose: వీరసింహుడి విజయోత్సవం.. హనీరోజ్ తో ‘బాలయ్య’ షాంపైన్ పార్టీ!

సినీనటి హనీరోజ్‌ (Honey Rose), బాలకృష్ణ చిత్ర విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Hone Rose

Hone Rose

బాలకృష్ణ (Balakrishna) హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని (Hyderabad) జేఆర్సీ కన్వెన్షన్‌లో ‘వీరసింహుని విజయోత్సవం’ వేడుకను నిర్వహించారు. కార్యక్రమం అనంతరం నటులు పార్టీ చేసుకున్నారు. సినీనటి హనీరోజ్‌ (Honey Rose), బాలకృష్ణ చిత్ర విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మీట్ లో హనీరోజ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సొంత ఇమేజ్ విషయానికి వస్తే, నందమూరి బాలకృష్ణ ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోలేదు. అతను చాలా అసాధారణమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నాడు. వయసులో కూడా హీరోయిన్లతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. తాజా చిత్రం ఇందుకు నిదర్శనం. బాలకృష్ణ గత రాత్రి “వీరసింహా రెడ్డి” తర్వాత పార్టీలో నటి హనీ రోజ్‌తో కలిసి కనిపించారు. బాలకృష్ణ, హనీ రోజ్‌లు తమ అతిథుల ముందు చేతులు కట్టుకుని షాంపైన్ తాగారు.

గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు బాలయ్య (Balakrishna) కెరియర్ లోనే మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీ గా సంచలన రికార్డు నెలకొల్పింది.  ఈ క్రమంలోనే వీర సింహారెడ్డి లో నటించిన వేడుకల్లో భాగమయ్యారు చిత్ర మేకర్స్. ఈ వేడుకల్లో బాలయ్య (Balakrishna) తన ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు సినిమా హిట్ అవ్వడానికి కారకులైన సాయి మాధవ్ బుర్ర , తమన్,రామ జోగయ్య శాస్త్రి.. గోపీచంద్ మల్లినేని కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతేకాదు ప్రసంగం మధ్యలో మాట్లాడుతూ బాలయ్య ఓ హాట్ కామెంట్ చేశాడు. “ఈ రోజుల్లో ఏం జరిగినా ఏం మాట్లాడినా కేసు బుక్ చేస్తున్నారు . ఇప్పుడు కేసులు పెట్టడం చాలా తేలిక కదా “..అంటూ సంచలన వ్యాఖ్యలు (Shocking Comments) చేశారు. దీంతో బాలయ్య ఈ కామెంట్స్ ఒకరికి బాగా తగిలేలా చేశారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రంతో కేరళ బ్యూటీ 31 ఏళ్ల హనీ రోస్ కీలక పాత్రలో బాలయ్య సరసన నటించి మెప్పించింది. వీరసింహారెడ్డి మరదలిగా హనీ రోస్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెరిసి మెప్పించింది. బాలయ్య మరదలిగా యంగ్ క్యారెక్టర్ లో.. అలాగే తల్లిగా ఏజ్డ్ రోల్ లో హనీ రోజ్ వేరియషన్స్ చూపించింది. దీనితో వీరసింహారెడ్డి (Veerasimha Reddy) చిత్రంతో హనీ రోస్ కి మంచి గుర్తింపు దక్కింది. తెలుగు యువత అంతా ప్రస్తుతం హనీ రోస్ జపం చేస్తున్నారు. హనీ రోస్ పాత్ర ఈ చిత్రంలో శృతి హాసన్ ని డామినేట్ చేసింది అనే చెప్పాలి.

Also Read: Shahrukh and Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌కి షారూఖ్ ఖాన్ కండీషన్‌.. ఎందుకో తెలుసా!

  Last Updated: 23 Jan 2023, 01:02 PM IST