Site icon HashtagU Telugu

Balakrishna Akhanda 2 : వాటి జోలికొస్తే ఊరుకోడా.. బాలకృష్ణ అఖండ 2 కథ ఇదేనా..?

Akhanda 2 Teaser

Akhanda 2 Teaser

బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ (Balakrishna) కాంబో సినిమా అంటే నందమూరి ఫ్యాన్స్ కే కాదు ఆడియన్స్ కు కూడా పండగ అన్నట్టే. సింహా తో మొదలైన ఈ కాంబో అఖండ వరకు వరుస సూపర్ హిట్లతో కొనసాగింది. ఇక లేటెస్ట్ గా బాలయ్య బోయపాటి ఇద్దరు కలిసి అఖండ 2 తో రాబోతున్నారు. అఖండ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అఖండ 2 ని తెరకెక్కిస్తున్నారు.

అఖండ సినిమా కన్నా భారీగా అంచనాలకు తగినట్టుగా ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ అఖండ 2 సినిమా కథకు సంబందించిన ఈ లీక్ వైరల్ గా మారింది. బాలయ్య అఖండ 2 (Akhanda 2) లో ఒక పాత్ర హిందూ దేవాలయ్యాల పవిత్రత కాపాడే పాత్రగా డిసైజ్ చేశారని తెలుస్తుంది. ఈ రోల్ లో బాలయ్య అదరగొట్టేస్తాడని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో హిందూ గ్రంధాల జోలికి వచ్చ్ వాటిని కించ పరచేలా చేసే వారి పై బాలయ్య ఎదురుదాడి చేస్తారని తెలుస్తుంది.

బాలకృష్ణ డ్యుయల్ రోల్..

అఖండ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో నటించారు. ఈ సినిమాలో కూడా డ్యుయల్ రోల్ దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. అఖండ లో అఘోరాగా అదరగొట్టిన బాలకృష్ణ ఈ సినిమాలో ఎలాంటి లుక్ తో సర్ ప్రైజ్ చేస్తారన్నది చూడాలి. బోయపాటి (Boyapati Srinu) మార్క్ సినిమాగా అఖండ 2 నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తుంది.

ప్రస్తుతం బాలయ్య కె.ఎస్ రవీంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎన్.బి.కె 109 పూర్తి కాగానే అఖండ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

Also Read : Sea Plane : విజయవాడ – శ్రీశైలం “సీ ప్లేన్” ట్రయల్ రన్ విజయవంతం

Exit mobile version