Site icon HashtagU Telugu

Balakrishna : బాలయ్య 110 కెరీర్ హయ్యెస్ట్ బడ్జెట్.. సూపర్ హిట్ సీక్వెల్ కి ఆమాత్రం లేకపోతే ఎలా..?

Balakrishna

Balakrishna

Balakrishna నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వీర మాస్ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాతో మరో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు బాలయ్య బాబు. ఈ మూవీ తర్వాత సూపర్ హిట్ సినిమా అఖండ సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నారని తెలిసిందే. బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరు కలిసి చేయబోతున్న ఈ అఖండ 2 సినిమా నుంచి లేటేస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.

సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖండ 2 సినిమాకు 150 కోట్ల బడ్జెట్ ని లాక్ చేసినట్టు టాక్. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ రేంజ్ హైయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించే మొదటి సినిమా ఇదే అని చెప్పొచ్చు.

అఖండ 2 సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమా స్టోరీ కూడా నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని మెప్పించేలా ఫిక్స్ చేశారట. అఖండ లో బాలయ్య డ్యుయల్ రోల్ లో మెప్పించారు. ముఖ్యంగా అఘోరా పాత్రలో అదరగొట్టారు. మరోసారి అదే తరహా పాత్రలో బాలకృష్ణ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు వస్తున్నారని చెప్పొచ్చు. ఎన్.బి.కె 109 సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం బోయపాటితో చేయబోయే అఖండ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ.

Also  Read : Allu Arjun Pushpa 2 : ఆ సినిమా కోసం మలేషియాని హైదరాబాద్ కి తెచ్చేశారు..!