Akhanda : బాలయ్య వన్ మ్యాన్ షో.. ఫ్యాన్స్ కు ‘అఖండ’మైన పూనకాలే..!

బాలయ్య అంటే మాస్.. మాస్ అంటే బాలయ్య... ఈ నందమూరి హీరోకు సరైన కథ పడాలేకానీ.. బాక్సాఫీస్ బద్దలుకావాల్సిందే.. రికార్డులన్నీ తుడిచిపెట్టుకోవాల్సిందే. వరంగల్ ఖిల్లా అయినా.. కర్నూల్ కొండారెడ్డి బురుజు అయినా.. ఏ సెంటర్ అయినా బాలయ్య బాబుదే హవా. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. ఆయన ఫ్యాన్స్ పూనకాలే మరి.

  • Written By:
  • Updated On - December 2, 2021 / 12:24 PM IST

బాలయ్య అంటే మాస్.. మాస్ అంటే బాలయ్య… ఈ నందమూరి హీరోకు సరైన కథ పడాలేకానీ.. బాక్సాఫీస్ బద్దలుకావాల్సిందే.. రికార్డులన్నీ తుడిచిపెట్టుకోవాల్సిందే. వరంగల్ ఖిల్లా అయినా.. కర్నూల్ కొండారెడ్డి బురుజు అయినా.. ఏ సెంటర్ అయినా బాలయ్య బాబుదే హవా. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. ఆయన ఫ్యాన్స్ పూనకాలే మరి. బాలయ్య అంటేనే ఓ అటంబాబు.. మరి అలాంటి అటంబాబును బోయపాటి డైరెక్ట్ చేస్తే… మాస్ జాతరే అని చెప్పక తప్పదు. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో లెజెండ్, సింహ సినిమాలు అదుర్స్ అనిపించాయి. ఇక మూడో సినిమా అంచనాలకు మించి ఉండబోతుందని ప్రేక్షకుల అంచనా. ప్రేక్షుకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసినా అఖండ సినిమా అభిమానులకే కాకుండా.. ఇండస్ట్రీ కే ఊపు ఇచ్చినట్టయింది.

బాలయ్య ఊరికి పెద్దగా ముర‌ళీ కృష్ణ పాత్రలో నటించారు. ఎవరికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా ముందుంటారు. అలాంటి ఊరికి కలెక్టర్ గా హీరోయిన్ ప్రగ్యా వస్తుంది. జనాల కోసం.. ఊరి సంక్షేమం కోసం హీరోపడే తాపత్రయం ఆమెకు బాగా నచ్చుతుంది. ఇద్దరి మనసులు ఒక్కటై పెళ్లి చేసుకుంటారు. మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగిపోతున్న వాళ్ల సంసారంలో వరదరాజులు (శ్రీకాంత్) అనే వ్యక్తి ఎంటర్ అవుతాడు. అక్రమ మైనింగ్ జరుపుతూ అకృత్యాలు సాగిస్తూ ఉంటాడు. సుఖసంతోషాలతో ఉండే ప్రజలు ఎన్నో ఇబ్బందలు పడతారు. మురళీ కృష్ణ స్పందించి ఆదుకునే ప్రయత్నం చేస్తాడు. దీంతో వరదరాజులు పగబట్టి కటకటాల్లోకి నెట్టేస్తాడు. ఆ తర్వాత మరో క్యారెక్టర్ అఖండ ఎంట్రీ ఇస్తాడు. అఖండ వరదరాజును ఎలా ఎదుర్కొంటాడు? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

కరోనా కారణంగా థియేటర్లన్నీ కళతప్పిపోయాయి. నవంబర్ లో 60పైగా సినిమాలు రిలీజ్ అయితే.. ఒక్కటి అంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఇప్పటికే ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ సినిమాలకు ప్రతిబంధకాలుగా నిలిచాయి. ఈ సమయంలోనే నేనున్నా అంటూ బాలయ్య వచ్చాడు. అఖండగా విశ్వరూపం ప్రదర్శించాడు. విలన్ గా శ్రీకాంత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లో మొదటిసారి మంచి పాత్ర దక్కించుకుంది. మొత్తంగా ఈ సినిమాను విశ్లేషిస్తే బాలయ్య వన్ మ్యాన్ షోగా అభివర్ణించక తప్పదు. బాలయ్య బాబు దెబ్బకు బాక్సాఫీస్ బద్ధలు కావాల్సిందేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఊర మాస్ డైలాగ్స్

హర హర మహాదేవ! శంభో శంకర ! కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.

ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా ? అనేదానికి శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!

ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టుసీమ తోమా ? పిల్ల కాలువ .!
విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!

నేను ఆత్మ వాడు నా శరీరం
నలభైమంది చచ్చారు నీవల్లే ..!

నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!
కళ్ళు తెరిచి జూలు విరిస్తే ..!

ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.
ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!

లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ , బాటమ్ ఆ , ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.
నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకు పిండం పెడుతాం. బోథ్ ఆర్ నాట్ సేమ్.