Balagam Venu Nani బలగం సినిమాతో తెలంగాణా నేపథ్యంతో మనసుకి హత్తుకునే కథనంతో సూపర్ హిట్ అందుకున్నాడు వేణు. దిల్ రాజు వారసులు నిర్మించిన ఈ సినిమా డైరెక్టర్ గా వేణుకి సూపర్ క్రేజ్ వచ్చేలా చేసింది. ఇక బలగం తర్వాత వేణు సెకండ్ ప్రాజెక్ట్ గా ఏం చేస్తాడు అన్న ఎగ్జైట్ మెంట్ ఉంది. అయితే ఛాన్స్ వస్తే వేణు డైరెక్షన్ లో సినిమా చేస్తానని నాని చెప్పగా నాని కోసం వేణు ఒక కథ రెడీ చేసినట్టు తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
తన ప్రతి సినిమా మినిమం గ్యారెంటీగా చేస్తూ సక్సెస్ రేటు కొనసాగిస్తున్న నాని లాస్ట్ ఇయర్ రెండు హిట్లతో సూపర్ ఫాం లో ఉన్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్న నాని ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా ఉంటుందని టాక్. మరోపక్క నాని కోసం ఒక పీరియాడికల్ ప్రేమ కథ సిద్ధం చేశాడట.
దిల్ రాజు నిర్మాణంలో వేణు డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుందని టాక్. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. బలగం తో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న వేణు సెకండ్ అటెంప్ట్ గా నానితో ప్రయోగం చేస్తున్నాడు. నాని హీరోగా పీరియాడికల్ మూవీ అది కూడా లవ్ స్టోరీ అనగానే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.
Also Read : Tillu Square Family Star : టిల్లు రిలీజ్ డేట్ లాక్.. వారం తర్వాత విజయ్.. అడ్జెస్ట్మెంట్ అయిపోయాయ్..!