Site icon HashtagU Telugu

Balagam : టీవీలో కూడా అదరగొట్టిన బలగం.. స్టార్ హీరోల సినిమాలను దాటి టీఆర్పీ..

Balagam Movie TRP Rating Creates History

Balagam Movie TRP Rating Creates History

ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) జంటగా కమెడియన్ వేణు(Comedian Venu) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బలగం(Balagam). దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కింది ఈ సినిమా. బలగం సినిమా మార్చ్ 3న చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించింది. కుటుంబంలోని కలహాలు, ఆత్మీయతలు నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమా ప్రతి ప్రేక్షకుడిని కదిలించింది. థియేటర్స్ లో భారీ హిట్ కొట్టి కలెక్షన్స్ ని రాబట్టింది.

బలగం సినిమాను కేవలం 2 కోట్లతో తెరకెక్కించగా దాదాపు 30 కోట్లను రాబట్టింది. ఇక ఈ సినిమాను ప్రేక్షకులే కాక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందించారు. దర్శకుడు వేణు, చిత్రయూనిట్ ని పలువురు ప్రముఖులు పిలిచి మరీ సన్మానించారు. కమెడియన్ గా, ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న వేణు ఇలాంటి మంచి సినిమా తీశారని అంతా ఆశ్చర్యపోయారు. ఇక ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంది. థియేటర్ లో ఉండగానే అమెజాన్ ఓటీటీలోకి వచ్చి అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది.

సినిమా రిలీజయిన రెండు నెలల తర్వాత బలగం సినిమా మే 7న స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయింది. దీంతో ఫ్యామిలీలంతా ఈ సినిమాని టీవీలలో చూశారు. ఇప్పుడు బలగం సినిమాకు వచ్చిన టీఆర్పీ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. మొదటిసారి టెలికాస్ట్ అయిన బలగం సినిమా ఏకంగా 14.30 టీఆర్పీ సాధించింది. అసలు ఇటీవల కాలంలో ఏ స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ రేంజ్ టీఆర్పీ రాలేదు. చివరిసారిగా RRR సినిమాకు 19 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత టీవీలో టెలికాస్ట్ అయిన సినిమాలకు ఇదే హైయెస్ట్ టీఆర్పీ. దీంతో బలగం సినిమా టీవీల్లో కూడా సక్సెస్ అయింది. దీనిపై చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలోనే బలగం సినిమాను మరిన్ని అంతర్జాతీయ అవార్డుల పోటీకి పంపిస్తామని, కుదిరితే ఆస్కార్ కు కూడా పంపిస్తామని దిల్ రాజు అన్నారు.

 

Also Read :  KTR : హైదరాబాద్‌కి వార్నర్ బ్రో సంస్థ.. KTR అమెరికా టూర్ లో పెద్ద సంస్థనే తెస్తున్నారుగా..