Vaishnavi Chaitanya : బేబీ నే కావాలంటున్న బలగం వేణు..

బలగం సినిమా మిస్సైనా సరే బేబీ తో హిట్ అందుకున్న వైష్ణవికి తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడు వేణు

Published By: HashtagU Telugu Desk
balagam fame venu chance to Vaishnavi Chaitanya

balagam fame venu chance to Vaishnavi Chaitanya

వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)..ఈ పేరు చిత్రసీమలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. చిన్న చిన్న షార్ట్స్ ఫిలిమ్స్ తో యూత్ ను ఆకట్టుకుంటూ వస్తున్న వైష్ణవి ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా వెండితెర ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు బేబీ (Baby) మూవీ తో హీరోయిన్ గా మరి..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు చిత్రసీమకు మరో టాలెంటెడ్ హీరోయిన్ దొరికిందని అంత మాట్లాడుకునే స్థాయికి చేరింది. యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న వైష్ణవి కోసం దర్శక , నిర్మాతలు పోటీపడుతున్నారు. వైష్ణవి ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ (Vaishnavi Chaitanya Remuneration) ఇస్తామంటూ ఆమె ఇంటివద్ద పడిగాపులు కాస్తున్నారట. వీరిలో బలగం డైరెక్టర్ వేణు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

Read Also : Shakila – Bigg Boss 7 : ‘బిగ్ బాస్’ హౌస్ లోకి షకీల.. ఇంకా లిస్టులో ఉన్నదెవరంటే.. ?

చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన వేణు (Director Venu)..బలగం (Balagam) మూవీ తో తనలోని స్టార్ డైరెక్టర్ ను బయటకు తీసి అందర్నీ ప్రశంసలు అందుకున్నాడు. బలగం సినిమాను ఎంత బాగా తెరకెక్కించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వేణు రెండు సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు. బలగం సినిమాలో హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది. వాస్తవానికైతే ఆ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించాల్సి ఉంది. కానీ ఆ టైం లో ఆమె ఆల్రెడీ బేబీ సినిమాకు సైన్ చేయడం వల్ల బలగం వదుకోవాల్సి వచ్చింది.

బలగం సినిమా మిస్సైనా సరే బేబీ తో హిట్ అందుకున్న వైష్ణవికి తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడు వేణు. తెలుగు అమ్మాయిలను ముందు ప్రోత్సహించాలని నిర్ణయించుకున్న వేణు ఇక్కడ హీరోయిన్స్ తోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో వేణు తన సెకండ్ సినిమాలో వైష్ణవిని దాదాపు ఫిక్స్ చేసినట్టే అంటున్నారు. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజునే నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా లో బేబీ నటన ఎలా ఉంటుందో చూడాలి.

  Last Updated: 28 Aug 2023, 01:28 PM IST