Venu: బలగం వేణు అందులో రెండుసార్లు స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల బలగం సినిమాతో డైరెక్టర్ గా మారిన విషయం తెల

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 11:15 AM IST

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల బలగం సినిమాతో డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు వేణు. 25 ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వేణు మొదట్లో అసిస్టెంట్ గా పనిచేసి ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చారు. ఇక ప్రభాస్ నటించిన మున్నా సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయ్యాడు.

అనేక సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఇటీవల దర్శకుడిగా మారి తెలంగాణ నేటివిటీతో బలగం సినిమా తీసి హిట్ కొట్టాడు. డైరెక్టర్గా మొదటి సినిమాతోనే అందరి చేత శభాష్ అనిపించుకున్నారు వేణు. ఇది ఇలా ఉంటే త్వరలో వేణు హీరో నానితో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. మా అమ్మ నాన్న కూరగాయల వ్యాపారం చేసేవారు. నేను కూడా చిన్నప్పటి నుంచి కూరగాయలు అమ్మే వాడిని.

ఇక నా చుట్టూ ఉన్నవాళ్లు అందరికంటే స్పెషల్ గా ఉండాలి అని నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అలా మార్షల్ ఆర్ట్స్ లో రెండు సార్లు స్టేట్ చాంపియన్గా కూడా విన్ అయ్యాను అని చెప్పుకొచ్చారు వేణు. ఇక నా చిన్నప్పటి నుంచి అందరూ నన్ను బాబు మోహన్ కి చుట్టంలా ఉన్నావు కమెడియన్ లా కనిపిస్తున్నావు అని అంటూ ఉండడంతో నాకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను అని చెప్పుకొచ్చారు వేణు. ఈ సందర్భంగా వేణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow us