Marathi Film: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మరాఠీ మూవీ, 3 వారాల్లో 58 కోట్లు వసూలు

చాలామందికి ప్రాంతీయ సినిమాలు అంటే చిన్న చూపు చూస్తారు.

Published By: HashtagU Telugu Desk
Marathi Film

Marathi Film

చాలామంది ప్రాంతీయ సినిమాలు అంటే చిన్న చూపు చూస్తారు. కానీ ప్రస్తుతం ప్రాంతీయ సినిమాలే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. కాంతార మూవీ కూడా చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మరాఠీమూవీ ‘బైపన్ భారీ దేవా’ మరాఠాలో దుమ్మురేపుతోంది. విడుదలైన 3 వారాల్లో రూ.58 కోట్ల దిమ్మతిరిగే కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. కేదార్ షిండే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 6 మంది నటీమణులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మరాఠీ చిత్రం అద్భుతమైన బాక్సాఫీస్ ప్రదర్శనతో సరికొత్త రికార్డులను సాధిస్తోంది.

ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో ‘బైపన్ భారీ దేవ’ అధికారిక బాక్సాఫీస్ లెక్కలను షేర్ చేశారు. “BLOCKBUSTER RUN  1వ రోజున రూ. 1 కోటి మాత్రమే వసూలు చేసిందని, ఆ తర్వాత అన్యూహంగా 3 వారాల్లో రూ. 58.59 కోట్ల కలెక్షన్లు సాధించి ఆశ్చర్యపర్చిందన్నారు. బైపన్ భారీ దేవా’లో రోహిణి హట్టంగడి, వందనా గుప్తే, సుకన్య కులకర్ణి, శిల్పా నవల్కర్, సుచిత్ర బాండేకర్, దీపా పరాబ్ నటించారు. ఈ చిత్రం జూన్ 30, 2023న థియేటర్లలో విడుదలైంది.

‘బైపన్ భారీ దేవ’ సినిమాను మరాఠీ దర్శకుడు కేదార్ శిందే తెరకెక్కించారు. ఆరుగురు అక్కాచెల్లెళ్లు ఓ కారణంతో దూరమవుతారు. మళ్లీ అనుకోకుండా కలవాల్సివస్తుంది. ఆ తర్వాత వారి మధ్య జరిగిన పరిణామాలే బైపన్ భారీ దేవ’ కథాంశం. ఈ సినిమాలో అక్కాచెళ్లళ్ల ప్రాతలో కనిపించిన నటీమణులు అద్భుతంగా నటించారు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ మూవీని చూసేందుకు ఇతర భాషల ప్రేక్షులు సైతం ఆసక్తిని చూపుతుండటం విశేషం.

Also Read: Chandrababu Naidu: పరువు గురించి ప్రభుత్వం మాట్లాడటం పెద్ద జోక్: చంద్రబాబు నాయుడు

  Last Updated: 21 Jul 2023, 03:14 PM IST