Allu Arjun Bail Conditions: అల్లు అర్జున్‌కు బెయిల్.. కోర్టు విధించిన ష‌ర‌తులివే!

అల్లు అర్జున్ శ‌నివారం ఉదయం విడుదల కానున్నారని జైలు అధికారులు వెల్లడించడంతో అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Congress Leaders Reaction

Congress Leaders Reaction

Allu Arjun Bail Conditions: అల్లు అర్జున్ జైలు నుంచి త్వ‌ర‌గా విడుద‌ల కావాల‌ని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల‌తో పాటు కుటుంబ స‌భ్యులు, టాలీవుడ్ సెలెబ్రిటీలు, హీరోలు శైతం ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. నాంప‌ల్లి క్రిమిన‌ల్ కోర్టు బ‌న్నీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ త‌ర్వాత హైకోర్టులో జ‌రిగిన క్వాష్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ‌గా అందులో అల్లు అర్జున్‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ (Allu Arjun Bail Conditions) 4 వారాల‌పాటు మంజూరు చేస్తున్న‌ట్లు తీర్పునిచ్చింది.

అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్ నిరాశ‌

అల్లు అర్జున్ శ‌నివారం ఉదయం విడుదల కానున్నారని జైలు అధికారులు వెల్లడించడంతో అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో జైలు నుంచి ఆయన విడుదల అవుతారని సాయంత్రం నుంచి చంచల్‌గూడ‌ జైలు బయట ఎదురుచూసిన అభిమానులు అసహనంతో వెనుదిరిగారు. అటు, అల్లు కుటుంబం కూడా రాత్రికి బన్నీ తిరిగొస్తాడని ఆశగా ఎదురు చూడగా నిరాశే మిగిలింది.

Also Read: Allu Arjun Episode: అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇదే.. అరెస్ట్ నుంచి బెయిల్ దాకా!

అయితే కోర్టు తీర్పు ఇచ్చే ముందు అల్లు అర్జున్‌కు కొన్ని ష‌ర‌తులు విధించింది.

కోర్టు తీర్పు

  • పిటిషనర్‌కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయబడింది.
  • రూ. 50,000 వ్యక్తిగత బాండు సమర్పించాలి.
  • పిటిషనర్ దర్యాప్తుకు సహకరించాలి
  • తక్షణమే ఈ ఉత్తర్వును అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

బెయిల్ మంజూరు షరతులు

  • పిటిషనర్ నేర విచారణకు పూర్తిగా సహకరించాలి.
  • విచారణలో లేదా సాక్షులపై ఎటువంటి ప్రభావం చూపించకూడదు.
  • సంబంధిత జైలు సూపరింటెండెంట్, పోలీసు కమిషనర్ ఈ ఆదేశాలను అమలు చేయడం
    ఖాయం చేయాలి.
  • ఉత్తర్వును సంబంధిత అధికారులకు తక్షణమే పంపాలని కోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.
  Last Updated: 14 Dec 2024, 12:27 AM IST