‘డీజే టిల్లు’ , ‘టిల్లు స్క్వేర్’ హిట్స్ తో స్టార్ బాయ్‌గా పేరు సంపాదించిన సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రస్తుతం తన కొత్త చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘బ్యాడాస్’ (Badass)అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో సిద్ధుది ఇది మూడో చిత్రం కావడం విశేషం. ఈ రోజు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు.
Winter Tips : ఎంత చౌక ధరకు వచ్చినా, వర్షాకాలంలో ఈ పండ్లను ఇంటికి తీసుకురావద్దు
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సిద్ధు ఒక చేతిలో సిగరెట్ పట్టుకొని, చుట్టూ మీడియా మైకులు, కెమెరాల మధ్య నిలబడి ఉండడం కనిపిస్తుంది. “మీరు హీరోలను చూశారు, విలన్లను చూశారు… కానీ ఇతనికి లేబుల్ వేయడం కుదరదు” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ కాస్త రఫ్ లుక్‌తో ఉండటం విశేషం. “If middle finger was a man” అనే స్టేట్‌మెంట్‌తో హీరో పాత్ర బోల్డ్‌గా ఉండనుందని స్పష్టం చేస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త తరహా కథ, పాత్రలతో సాగే మాస్ యాక్షన్ డ్రామా అనిపిస్తోంది.
దర్శకత్వంతో పాటు కథ, మాటలు రాసే రచయితగానూ సిద్ధు ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఇదే ఆయన ప్రత్యేకత. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాతో రవికాంత్ – సిద్ధు కలయిక ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వస్తున్న ‘బ్యాడాస్’ భారీ బడ్జెట్‌తో రూపొందుతుండగా, 2025లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా సిద్ధు మరోసారి మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడా అనేది ఆసక్తిగా మారింది.