బాలకృష్ణ (Balakrishna) ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. బాలయ్య నటించిన తాజా చిత్రం ఇప్పట్లో ఓటిటి లో వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. బాబీ దేఓల్, ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటెల వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాలయ్య పవర్‌పుల్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాను సూపర్ హిట్ చేసాయి. అయితే ఈ మూవీ ఓటీటీ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు.
New Pass Books : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ
ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ‘గేమ్ ఛేంజర్’ స్ట్రీమింగ్ మొదలవగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బుల్లితెరపైకి రానుంది. అయితే ‘డాకు మహారాజ్’ మాత్రం ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాను డిజిటల్‌లో ఎప్పుడెప్పుడు చూసేయాలా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. వాలెంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారం కల్లా స్ట్రీమింగ్ అవుతుందని భావించినా, తాజా సమాచారం ప్రకారం ఇది మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శితమవుతుండటంతో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలన్న నిర్ణయాన్ని మూవీ టీమ్ పాటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాను తెలుగు మాత్రమే కాకుండా, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర భాషల డబ్బింగ్, టెక్నికల్ పనులు పూర్తి కావాల్సి ఉండటంతో, ఓటీటీ విడుదల మరింత ఆలస్యమవుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని పనులు పూర్తయితే మార్చి మొదటి వారంలో ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చే అవకాశముంది.