Vaishnavi Chaitanya : డబల్ ఇస్మార్ట్ లో బేబీ వైష్ణవి గ్లామర్..!

అంతకుముందు షార్ట్ ఫిలింస్, వెబ్ సీరీస్ లలో నటించిన వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) బేబీ సినిమాతో హీరోయిన్ గా చేసిన మొదటి

Published By: HashtagU Telugu Desk
Baby Vaishnavi Special Song For Double Ismart

Baby Vaishnavi Special Song For Double Ismart

అంతకుముందు షార్ట్ ఫిలింస్, వెబ్ సీరీస్ లలో నటించిన వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) బేబీ సినిమాతో హీరోయిన్ గా చేసిన మొదటి ప్రయత్నంతోనే సూపర్ హిట్ అందుకుంది. సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్.కె.ఎన్ నిర్మించారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు కూడా లీడ్ రోల్స్ గా నటించారు. ఈతరం యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా బేబీ సినిమా వచ్చింది.

7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా 90 కోట్ల గ్రాస్ సాధించింది అంటే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇదిలాఉంటే బేబీ సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య వరుస అవకాశాలు అందుకుంటుంది. అమ్మడు ఇప్పటికే రెండు సినిమాలు చేస్తుండగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా చేస్తున్న డబల్ ఇస్మార్ట్ లో కూడా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

Also Read : Prabhas : సలార్ ప్రమోషన్స్ ఎక్కడ.. రెబల్ ఫ్యాన్స్ అప్సెట్ కి కారణాలు ఏంటి..?

సినిమాలో అమ్మడు ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం డబల్ ఇస్మార్ట్ లో వైష్ణవి చైతన్య కేవలం స్పెషల్ సాంగ్ మాత్రమే చేస్తుందని టాక్. సినిమాలోని ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. వైష్ణవికి ఈ సాంగ్ తో మరింత క్రేజ్ వస్తుందని అంటున్నారు.

రామ్ తో స్పెషల్ సాంగ్ అంటే కచ్చితంగా వైష్ణవికి లక్కీ ఛాన్స్ అనే చెప్పొచ్చు. అయితే ఒక సూపర్ హిట్ పడ్డాక కూడా స్పెషల్ సాంగ్ చేయడంపై కొందరు ఆడియన్స్ మాత్రం అమ్మడు ట్రాక్ తప్పుతుందేమో అన్న డౌట్ పడుతున్నారు. రామ్ సినిమాతో బేబీ వైష్ణవికి ప్లస్ అవుతుందా లేదా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 12 Dec 2023, 01:09 PM IST