Site icon HashtagU Telugu

Producer SKN: తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌కి భారీ విరాళం ఇచ్చిన SKN .. ఎన్ని లక్షలో తెలుసా?

Mixcollage 12 Feb 2024 09 15 Am 8504

Mixcollage 12 Feb 2024 09 15 Am 8504

తెలుగు ప్రేక్షకులకు నిర్మాత ఎస్ కేఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగా ఫ్యాన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో ఎదిగి ఇప్పుడు నిర్మాతగా మాస్ మూవీ మేకర్స్ స్థాపించి వరుస యూత్ సినిమాలు తీస్తూ హిట్స్ కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే SKN గత ఏడాది బీబీ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ట్రూ లవర్ అనే మరో తమిళ డబ్బింగ్ సినిమాతో కూడా భారీ సక్సెస్ ను అందుకున్నారు SKN. ఆల్రెడీ మరో మూడు లవ్ సినిమాలు అనౌన్స్ చేశారు SKN.

ఇది ఇలా ఉంటే వరుసగా విజయాలు సాధిస్తున్న సమయంలో ఆయన తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి నిర్మాత SKN ఏకంగా 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగగా ఇందులో గుడుంబా శంకర్ దర్శకుడు వీర శంకర్ నేతృత్వంలోని ప్యానల్ ఘన విజయం సాధించింది. ఈ ప్యానల్ లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వీరశంకర్ తో పాటు వైస్ ప్రసిడెంట్ గా పోటీ చేసిన డైరెక్టర్స్ సాయి రాజేష్, వశిష్ట కూడా గెలిచారు.

 

బేబీ దర్శకుడు, తన ఫ్రెండ్ సాయి రాజేష్ తో పాటు డైరెక్టర్ వసిష్ఠ వైస్ ప్రసిడెంట్స్ గా గెలవడంతో వారికి మద్దతుగా నిర్మాత SKN ఈ భారీ విరాళాన్ని ప్రకటించాడు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కోసం ఈ 10 లక్షల రూపాయలని ప్రకటించినట్టు తెలిపారు. నిర్మాత SKN ఇంత భారీ విరాళం ఇవ్వడంతో ఆశ్చర్యపోతూనే అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుల సంఘానికి ఒక నిర్మాత ఇలా విరాళం ఇవ్వడం, ఇంత ఎక్కువ అమౌంట్ ఇవ్వడంపై అన్నది ఆశ్చర్య పోవాల్సిన విషయం అంటూ కొనియాడుతున్నారు. ఈ మధ్యకాలంలో SKN ఖాతాలో వరుస విషయాలు వచ్చి చేరుతున్నాయి.