Site icon HashtagU Telugu

Baby Collections : బేబీ కోసం పరుగులు పెడుతున్న యువత

Baby Collections

Baby Collections

బేబీ..బేబీ..బేబీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వైరల్ గా మారింది. ఇంతకీ బేబీ ఎవరా..అని అనుకుంటున్నారా..షార్ట్ ఫిలిమ్స్ తో యూత్ లో భారీగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వైష్ణవి చైతన్య..ఇప్పుడు బేబీ మూవీ తో వెండితెర కు హీరోయిన్ గా పరిచమైంది. మొదటి సినిమాతోనే మహానటి అనే బిరుదు సొంతం చేసుకుంది.

ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య జంటగా కలర్ ఫోటో ఫేమ్ సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన బేబీ (Baby Movie ) మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. SKN ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆట తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు వైష్ణవి యాక్టింగ్ కు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం పబ్ కల్చర్, సిగరెట్లు, మద్యం లాంటి పోకడల్లో చిక్కుకొని, యువత తమ జీవితాల్ని నాశనం చేసుకోకూడదనే సందేశాన్ని ఈ సినిమాలో ఇచ్చాడు సాయి రాజేష్.

ప్రస్తుతం యువత ఎంత ఈజీ గా ప్రేమలో పడుతున్నారో..ఎవరికీ వారు నేను ఏ తప్పు చేయడం లేదు అనుకుంటూనే తప్పు చేయడం..ఆ తప్పు ను సరిచేసుకోవడం కోసం మరో తప్పు చేయడం వంటివి కళ్లకు కట్టినట్లు చూపించాడు. దీనికి యువత బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు సినిమా (Baby Movie ) చూడాలని థియేటర్ కు పరుగులు పెడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది.

ఐదు రోజుల్లో ఈ సినిమా (Baby Movie ) ప్రపంచవ్యాప్తంగా రూ. 34.9 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచే 28.15 కోట్లు రాగా, ఓవర్సీస్ లో రూ.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియా వైడ్ 29.9 కోట్లుగా ఉంది. వచ్చే శుక్రవారానికి ఈ సినిమా ఈజీగా రూ.50 కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Read More : Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్