Baby : ప్రభాస్ ను క్రాస్ చేసిన బేబీ..మాములుగా లేదు కదా

కంటెంట్ ఉండాలే కానీ అందులో చిన్న హీరోనా..పెద్ద హీరోనా ..రీమేక్ సినిమానా అనేది సినీ లవర్స్ చూడరు.

  • Written By:
  • Publish Date - July 20, 2023 / 04:48 PM IST

కంటెంట్ ఉండాలే కానీ అందులో చిన్న హీరోనా..పెద్ద హీరోనా ..రీమేక్ సినిమానా అనేది సినీ లవర్స్ చూడరు. సినిమా బాగుందనే టాక్ వస్తే చాలు ఎంత టికెట్ పెట్టైనా సరే సినిమా చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఆ మధ్య కాంతారా చిత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో వసూళ్లు రాబట్టిందో చూసాం. తాజాగా ఇప్పుడు మరో చిన్న చిత్రం అదే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది. అది కూడా ప్రభాస్ చిత్ర కలెక్షన్లను క్రాస్ చేసి మరి హావ చూపిస్తుంది. ఇంతకీ ఏంటా చిత్రం అనుకుంటున్నారా..అదే మన బేబీ (Baby Movie ).

ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య జంటగా కలర్ ఫోటో ఫేమ్ సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన బేబీ (Baby Movie ) మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆట తోనే యూత్ కు దగ్గరైంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు వైష్ణవి యాక్టింగ్ కు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం యువత ఎంత ఈజీ గా ప్రేమలో పడుతున్నారో..ఎవరికీ వారు నేను ఏ తప్పు చేయడం లేదు అనుకుంటూనే తప్పు చేయడం..ఆ తప్పు ను సరిచేసుకోవడం కోసం మరో తప్పు చేయడం వంటివి కళ్లకు కట్టినట్లు చూపించాడు. యువత మన సినిమానే అంటూ చెప్పుకుంటూ థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లే వసూళ్లు రాబడుతుంది.

మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత రెండవ రోజు , మూడవ రోజు వసూళ్లు కూడా మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి సరికొత్త సంచలనం సృష్టించింది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ (Adhipurush) చిత్రానికి 5 వ రోజు దాదాపుగా 2 కోట్ల 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘బేబీ’ చిత్రానికి 5 వ రోజు 2 కోట్ల 90 లక్షణాలు రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే రాబోయే రోజుల్లోనూ బేబీ హావ ఇంకా గట్టిగానే ఉంటుందని భావిస్తున్నారు. కంటెంట్ లో బలం ఉంటే స్టార్స్ అవసరం లేదు, ముక్కు మొహం తెలియని వాళ్ళు నటించినా కూడా అద్భుతమైన వసూళ్లు వస్తాయి అని చెప్పడానికి ఉదాహరణే ఈ బేబీ చిత్రం.

Read Also : Urinate : అర్జెన్సీ మూత్రం ఎంత పనిచేసిందో తెలుసా..?