Babloo Prithiveeraj : డ్రైవర్ మాట విని 100 ఎకరాల భూమిని కోల్పోయిన నటుడు బబ్లూ పృథ్వీరాజ్..

తెలుగులోకి సూపర్ హిట్ మూవీ 'పెళ్లి'(Pelli)తో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీతోనే విలన్ గా నంది అవార్డుని సొంతం చేసుకొని తెలుగు ఆడియన్స్ తో పాటు మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించారు నటుడు బబ్లూ పృథ్వీరాజ్.

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 11:00 PM IST

ప్రముఖ సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్(Babloo Prithiveeraj ).. తన ప్రత్యేక నటనతో తెలుగు, తమిళ ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చారు. తమిళ నటుడు అయిన పృథ్వీరాజ్ చైల్డ్ ఆర్టిస్ట్(Child Artist) గా కెరీర్ మొదలుపెట్టారు. 1985లో రజినీకాంత్(Rajinikanth) సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. ఇక తెలుగులోకి సూపర్ హిట్ మూవీ ‘పెళ్లి'(Pelli)తో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీతోనే విలన్ గా నంది అవార్డుని సొంతం చేసుకొని తెలుగు ఆడియన్స్ తో పాటు మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించారు. అక్కడి నుంచి టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ వచ్చారు.

దీంతో హైదరాబాద్(Hyderabad) లో కూడా ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుండడంతో ఇక్కడ ఒక ప్రాపర్టీ కొనుకుందాం అని అనుకున్నారు. ఈ క్రమంలోనే తనకి ఒక సినిమాకు గాను ఒక 10 లక్షల అమౌంట్ వచ్చింది. ఆ డబ్బుతో ఒక స్థలం కొందామని ఫిక్స్ అయిన పృథ్వీరాజ్ ఒక వ్యక్తిని సంప్రదించగా అతడు బంజారా హిల్స్ లో అండ్ ఇప్పుడు  శంషాబాద్(Shamshabad) ఎయిర్ పోర్ట్ ఉన్న దగ్గర ప్రాపర్టీ చూపించాడు. శంషాబాద్ దగ్గర సుమారు 100 ఎకరాల భూమిని కేవలం 10 లక్షలకే అప్పటిలో బేరం వచ్చింది. దీంతో ఆ 100 ఎకరాలని కొనేద్దామని పృథ్వీరాజ్ నిర్ణయించుకున్నారు.

కానీ అతడి డ్రైవర్ చెప్పిన ఒక్క మాట వల్ల ఆ 100 ఎకరాలు అప్పుడు కొనకుండా ఆగిపోయి బంజారాహిల్స్ లో ఒక చిన్న ప్రాపర్టీ తీసుకున్నారట. ఇక ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చాక ఆ భూమి విలువ ఎన్నో కోట్లు పలుకుతుంది. ఈ విషయంలో పృథ్వీ ఇప్పటికి బాధపడతారట. ఇంతకీ ఆ డ్రైవర్ ఏమి చెప్పాడంటే.. ఇదంతా కొండ ప్రదేశం. కింద అంతా రాయి. మీరు 10 లక్షలకి 100 ఎకరాలు వస్తున్నాయని తీసుకుంటే దాని చుట్టూ ఫెన్సింగ్ వేయడానికే 20 లక్షలు అవుతాయి. ఇక్కడ భవిష్యత్తులో కూడా డెవలప్ ఉండదు. అంతా ఖాళీ ప్రదేశం అని చెప్పాడట. ఆ మాటలు విని పాపం పృథ్వీరాజ్ శంషాబాద్ దగ్గర ఇప్పుడు వందల కోట్ల విలువ చేసే భూమిని కోల్పోయా

 

Also Read : Vijay Devarakonda : యాక్టర్ అయితే అంటే తిట్టినా.. తమ్ముడి గురించి విజయ్ దేవరకొండ.. బేబీ సక్సెస్ ఈవెంట్‌లో