యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) లేటెస్ట్ సెన్సేషన్ దేవర మూవీ..బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించాయి. సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.దేవర (Devara) రిలీజ్ డే నాడు టాక్ బాగాలేకపోయినా తర్వాత తర్వాత సినిమా పుంజుకుంది. వసూళ్లలో 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన దేవర మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది.
ఐతే దేవర థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. ఈ క్రమంలో సినిమాలోని ‘ఆయుధ పూజ’ (Ayudha Pooja) సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక OTT రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సమాచారం ప్రకారం నవంబర్ మొదటి వారం అంటే నవంబర్ 7న ఎన్టీఆర్ దేవర ఓటీటీ రిలీజ్ అవుతుందని అంటున్నారు. దేవర సినిమాలో తారక్ యాక్షన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. సినిమా ఓటీటీ రిలీజ్ తర్వాత డిజిటల్ ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.
Read Also :