Avika Gor చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ తెలుగు ఆడియన్స్ కు సుపరిచితురాలే. ఆ సీరియల్ తో ప్రేక్షకులను మెప్పించిన అమ్మడిని ఇక్కడ హీరోయిన్ గా పరిచయం చేశారు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్న అవికా గోర్ సక్సెస్ అందుకోవడంలో వెనకపడింది. సినిమాల సెలక్షన్ లో తప్పిదాల వల్లే ఇలా జరుగుతుందని చెప్పొచ్చు. ఐతే సినిమాల వల్ల కానిది సోషల్ మీడియా వల్ల అవుతుందని ప్రూవ్ చేస్తుంది అవికా గోర్.
సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటున్న అవికా గోర్ అలా ఛాన్సులు కూడా రాబట్టుకోవాలని ఫిక్స్ అయింది. తెలుగులో సినిమాల్లో పెద్దగా అవకాశాలు అందుకోని అవికా గోర్ లాస్ట్ ఇయర్ రెండు వెబ్ సీరీస్ లతో మాత్రం వచ్చింది. మాన్స్న 24, వధువు వెబ్ సీరీస్ లతో అలరించింది అవికా గోర్.
ఇక లేటెస్ట్ గా అమ్మడు మత్స్య కన్న లుక్ తో అదరగొట్టేసింది. సాగర్ కన్య కాస్టూం తో అవికా గోర్ స్పెషల్ గా కనిపిస్తుంది. అవికా గోర్ క్రేజీ ఫోటో షూట్స్ లో ఇది ఒకటని చెప్పొచ్చు. అవికా గోర్ ఏం చేసినా సరే అది ఇలానే ఉంటుంది.
సాగర కన్యగా సోయగాల వల వేస్తున్న అవికా గోర్ చూపుల వల్లో ఫాలోవర్స్ అంతా చిక్కుకునేలా ఉన్నారు. మరి అవికా గోర్ ఈ రేంజ్ లో ఫోటో షూట్స్ చేస్తుండగా అవి అవకాశాలు తెచ్చేలా చేస్తున్నాయా లేదా అన్నది చూడాలి.
Also Read : Samantha : అతనికి బర్త్ డే విష్ చేసి ఐలవ్యూ చెప్పిన సమంత..!