ప్రముఖ నటి అవికా గోర్, సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీ(Avika Gor and Milind Chandwani )తో ఎంగేజ్‌మెంట్ (Engagement ) జరుపుకుంది. ఈ విషయాన్నీ అవికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, వారి మధ్య ఉన్న ప్రేమను చాటి చెప్పింది. అవికా షేర్ చేసిన పిక్స్ లలో బ్లష్ పింక్ చీరలో అద్భుతంగా కనిపించిన అవికా, మిలింద్ చెంపపై ముద్దిచ్చే ఫోటో, పూలతో అలంకరించిన తోటలో ఇద్దరూ నవ్వుకుంటూ కనిపించే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Nithin Thammudu : తమ్ముడు ట్రైలర్ టాక్
మిలింద్ చంద్వానీ (Milind Chandwani) విషయానికి వస్తే..ఇతడో ఓ సామాజిక కార్యకర్త, ఎంటర్‌ప్రెనర్. ఆయన స్థాపించిన “క్యాంప్ డైరీస్” అనే ఎన్జీవో ద్వారా పేద పిల్లలకు నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మక పరిజ్ఞానం అందిస్తున్నారు. మిలింద్ IIM అహ్మదాబాద్ నుంచి MBA పూర్తి చేశాక, ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించారు. 2019లో MTV రోడియ్స్ రియల్ హీరోస్ షోలో పాల్గొన్న తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చారు. సామాజిక సేవతో పాటు పాఠశాలలో అసిస్టెంట్ ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశారు. అవికాతో పరిచయం , ఆ తర్వాత ప్రేమ.. ఇప్పుడు ఆమెకు జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నారు.
RCB For Sale: అమ్మకానికి ఆర్సీబీ.. రూ. 17 వేల కోట్లు ఫిక్స్ చేసిన జట్టు యజమాని?!
‘బాలిక వధు’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అవికా, చిన్న వయసులోనే విశేషమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత ‘ససురాల్ సిమర్ కా’ వంటి హిట్ షోలు, అలాగే తెలుగు సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసింది. మిలింద్‌తో ఆమెకు 2020లో హైదరాబాద్‌లో పరిచయం ఏర్పడింది. మొదట మిత్రులుగా ప్రారంభమైన ఈ బంధం, ఆరు నెలల పాటు మిలింద్ ఫ్రెండ్ జోన్‌లోనే ఉంచినప్పటికీ, అవికా తన మనసులో అప్పుడే వివాహం చేసుకున్నట్లు సరదాగా చెబుతూ ఉండేది. ఇప్పుడు ఆ కల నిజమవుతోంది. ఈ జంట తమ ప్రేమను అధికారికంగా ప్రకటించడం తో నెటిజన్ల అభినందనలు తెలుపుతున్నారు.