Site icon HashtagU Telugu

Avika Gor – Andre Russell : వెస్టిండీస్ క్రికెటర్‌ ఆండ్రీ రస్సెల్‌తో.. అవికా గోర్ ఆల్బమ్ సాంగ్..

Avika Gor Andre Russell Ladki Tu Kamaal Ki Album Song

Avika Gor Andre Russell Ladki Tu Kamaal Ki Album Song

Avika Gor – Andre Russell : చిన్నారి పెళ్లికూతురుగా ఆడియన్స్ కి పరిచయమైనా అవికా గోర్.. ఆ తరువాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ భామ ఒక ఆల్బమ్ సాంగ్ లో నటించారు. ఈ సాంగ్ వెస్టిండీస్ క్రికెటర్‌ ఆండ్రీ రస్సెల్‌ అవికా గోర్ తో కలిసి చిందేశారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆండ్రీ రస్సెల్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున ఐపీఎల్ లో ఆడుతున్నాడు.

ఒక పక్క ఆల్ రౌండర్ గా ఐపీఎల్ లో అదరగొడుతూనే.. మరోపక్క ఆల్బమ్ సాంగ్స్ లో డాన్స్ లు చేస్తూ కూడా అదరగొడుతున్నాడు. వెస్టిండీస్ క్రికెటర్స్ డాన్స్ కి వరల్డ్ వైడ్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఎందుకంటే వాళ్ళు సిక్సులు కొట్టినా, సెంచరీలు చేసినా లేక వికెట్లు తీసినా గ్రౌండ్ లో క్రేజీ స్టెప్పులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో.. ఇలా డాన్స్ లు వేసి అందర్నీ ఆకట్టుకున్నవారే. ఇప్పుడు ఆండ్రీ రస్సెల్‌ కూడా డాన్స్ వేసి.. నేను తక్కువ కాదు అంటున్నాడు.

‘లడ్కీ తు కమాల్ కీ’ అంటూ సాగే హిందీ ఆల్బమ్ సాంగ్ లో అవికా గోర్ తో హుషారైన స్టెప్పులు వేసి రస్సెల్ అదరగొట్టారు. కేవలం డాన్స్ వేయడమే కాదు పాటని కూడా పాడాడు రస్సెల్. ఇక అవికా గోర్ అయితే తన అందాలతో కుర్రాళ్ళ గుండెలను కొల్లగొడుతుంది. నీలిరంగు చీరలో పడుచు పరువాలు ఒలికిస్తూ అబ్బాయిల మనసు దోచుకుంటుంది. మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ ని మీరు కూడా చూసేయండి.