Site icon HashtagU Telugu

Avatar on Adipurush: ఆదిపురుష్ పై ‘అవతార్’ ఎఫెక్ట్.. ఒత్తిడిలో ఓంరౌత్!

Avatar on adipurush

Avatar

విజువల్ ఎఫెక్ట్స్ (Visuals Effects) తో వండర్ క్రియేట్ చేయడంలో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఇతర డైరెక్టర్ల కంటే ముందుంటాడు. సినిమాపై ఆయనకున్న ప్యాషన్ అందుకు కారణం కూడా. టెక్నికల్ పరంగా ఏ చిన్న సీన్ కూడా డ్యామేజ్ కాకుండా జాగ్రత్తపడతారు. అయన అభిరుచి ఆయన తెరకెక్కించే సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తుంది కూడా. అవతార్ 1 తో మెప్పించిన ఆయన తాజాగా అవతార్ 2 (Avatar2) లో మాత్రం వాటర్ లో వండర్ క్రియేట్ చేశాడు.

సినిమాల నిర్మాణంలో సాంకేతిక అంశాల విషయానికి వస్తే, అతను కొత్త పుంతలు తొక్కడంలో పేరుగాంచాడు. కామెరూన్ లేటెస్ట్ మూవీ “అవతార్”2 (Avatar2) లోని అద్భుతమైన విజువల్స్ కోసం ప్రశంసలు అందుకుంటుంది. సినిమా నిడివి, డల్ పార్ట్‌లతో విమర్శలు వచ్చినా స్పెషల్ ఎఫెక్ట్స్ కారణంగా ప్రేక్షకులు యాక్షన్‌లో మునిగిపోయారు. “అవతార్”లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కూడా అత్యాధునికమైనది.

అయితే ప్రభాస్, కృతి సనన్ నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్” అదే మేకింగ్ పద్ధతిని ఉపయోగించుకుంటుంది. “ఆదిపురుష్” టీజర్ ఘరంగా నిరాశ పర్చడంతో సినిమా విడుదల తేదీని మార్చి ఆ పనుల్లో నిమగ్నమయ్యారు మేకర్స్. అయితే భారతీయ సినీ ప్రేక్షకులు “అవతార్ 2” (Avatar2) చూసినందున, ఆది పురుష్ తో సంతృప్తి చెందకపోవచ్చునని సినీ క్రిటిక్స్ భావిస్తున్నారు. “ఆదిపురుష్” (Adipurush) దర్శకుడు ఓం రౌత్ సాధ్యమైనంత ఉత్తమమైన విజువల్ ఎఫెక్ట్స్ సాధించాలనే ఒత్తిడిలో ఉన్నాడు.

Also Read: Sridevi Vs Suguna Sundari: టాక్ ఆఫ్ ది టాలీవుడ్.. బాలయ్య, చిరుతో శృతి రొమాన్స్!