Avatar 3 Tickets: ‘అవతార్ 3’ టికెట్ బుకింగ్స్‌ తేదీ ఖరారు!

విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని భారతదేశంలో IMAX ఫార్మాట్‌లో చూడాలనుకునే అభిమానుల కోసం బిగ్ అప్డేట్ ఉంది. భారతదేశంలో IMAX ఫార్మాట్ కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Avatar 3 Tickets

Avatar 3 Tickets

Avatar 3 Tickets: ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar 3 Tickets) కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజువల్ వండర్‌గా ప్రఖ్యాతి గాంచిన ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన మూడవ భాగం విడుదల కానుండగా.. తాజాగా కామెరూన్ చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

కామెరూన్ సంచలన నిర్ణయం

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కామెరూన్.. తన తాజా చిత్రం అవతార్ 3 బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైతే, తాను ఈ ‘అవతార్’ ఫ్రాంచైజీని శాశ్వతంగా ముగింపు పలుకుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా పెద్ద సాహసోపేతమైన ప్రకటన అయినప్పటికీ తాను ప్రేక్షకులకు అందించిన కథ, అత్యాధునిక విజువల్స్ పట్ల ఆయనకు ఎంత అచంచలమైన నమ్మకం ఉందో స్పష్టం చేస్తోంది. ఈ ప్రకటన మూడవ భాగంపై అంచనాలను మరింత పెంచింది.

Also Read: Samantha 2nd Wedding : సమంత పెళ్లిపై పూనమ్ పరోక్ష విమర్శలు!

టికెట్ బుకింగ్స్ అప్‌డేట్

కామెరూన్ ప్రకటనతో చిత్రంపై ఏర్పడిన భారీ క్రేజ్ మధ్య భారతీయ ప్రేక్షకులు టికెట్ అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. తాజాగా దేశీయ పంపిణీదారు ఈ నిరీక్షణకు ముగింపు పలుకుతూ అధికారిక తేదీని ధృవీకరించారు. డిసెంబర్ 5, 2025 నుండి ఈ సినిమా టికెట్ బుకింగ్స్ గ్రాండ్‌గా ప్రారంభమవుతాయి. ఈ బుకింగ్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, మలయాళంతో సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లోనూ అందుబాటులో ఉంటాయి.

గత రెండు భాగాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా ముందస్తు బుకింగ్స్ ద్వారా బలమైన డిమాండ్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అవతార్ 3 చిత్రంలో కూడా సామ్ వర్తింగ్టన్, జో సల్దానా తమ కీలక పాత్రల్లో తిరిగి రానున్నారు. దీనికి జేమ్స్ కామెరూన్‌తో పాటు జాన్ ల్యాండౌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని భారతదేశంలో IMAX ఫార్మాట్‌లో చూడాలనుకునే అభిమానుల కోసం బిగ్ అప్డేట్ ఉంది. భారతదేశంలో IMAX ఫార్మాట్ కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో IMAX లో వీక్షించే అవకాశం ఉండదు.

  Last Updated: 01 Dec 2025, 07:36 PM IST