Site icon HashtagU Telugu

Avatar 2 Collections: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘అవతార్ 2’.. ఫస్ట్ డేకు అదిరిపొయే కలెక్షన్లు!

Avatar 2 collections

Avatar 2

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ (Tollywood) సినిమాతో మోస్తారు కలెక్షన్లతో నెట్టుకొస్తున్న థియేటర్లు అవతార్2 (Avatar 2) దెబ్బకు కాసుల వర్షంతో తడిసిముద్దవుతున్నాయి. జనాలతో కిటకిటలాడుతున్నాయి. మొదటిరోజు దుమ్మురేపే కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ మూవీ. అవతార్‌ను పార్ట్ 1 అధిగమించి ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. జేమ్స్ కెమరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం 38.50 నుండి 40.50 కోట్ల రూపాయలను రాబట్టిందని బాలీవుడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

అవతార్ 2 (Avatar 2)భారతీయ మార్కెట్‌లో 2019 చిత్రం ఎవెంజర్స్ తర్వాత రెండో అత్యధిక బాక్సాఫీస్ ఓపెనర్‌గా నిలిచింది. ఇది తొలి రోజున రూ. 53.10 కోట్లు రాబట్టింది. సైన్స్ ఫిక్షన్ డ్రామా దక్షిణాది మార్కెట్‌లో అత్యధికంగా డబ్బులు రాబట్టింది. కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రూ.22 కోట్లు రాబట్టింది. మిగతా రీజియన్లలో టోటల్ గా రూ.17 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

కరోనా మహమ్మారి తర్వాత ఇంత భారీ ఓపెనింగ్ డే ఫిగర్‌ను నమోదు చేసిన మొదటి చిత్రంగా ఈ చిత్రం నిలిచింది. నైజాం/ఆంధ్రా నుండి వస్తున్న గణాంకాలు అవెంజర్స్ కంటే కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించాయని తెలుస్తోంది. నైజాం/ఆంధ్రాలో 10 కోట్ల మార్క్ ను దాటింది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మొదటిరోజునే (First Day Collections) కోట్లు రాబట్టిన ఈ మూవీ,  తొలి వారంలో రూ.100 కోట్ల మార్కును ఈజీగా దాటేస్తుందని సినీ క్రిటిక్స్ ధీమాతో చెబుతున్నారు.

Also Read: Bigg Boss Winner: ‘బిగ్ బాస్ సీజన్ 6’ విన్నర్ అతడే!

Exit mobile version