Site icon HashtagU Telugu

Avatar 2: అంచనాలు పెంచేస్తున్న అవతార్2.. ట్రైలర్ ఇదిగో!

Avatar2 Imresizer

Avatar2 Imresizer

అవతార్ మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో, రెండో భాగమైన అవతార్-2 కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తోంది ప్రపంచం. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అవతార్-2ను తెరకెక్కించాడు జేమ్స్ కామరూన్. పార్ట్-2కు ది వే ఆఫ్ వాటర్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన దర్శకుడు, తాజాగా మరో ట్రయిలర్ రిలీజ్ చేశాడు. ఈసారి త్రీడీ అనుభూతిని అందించే విధంగా ట్రయిలర్ కట్ చేశాడు. తాజా ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా చూసేద్దాం అనేంతలా ఉత్సకత రేకెత్తించింది పండోరా గ్రహం చుట్టూ తిరిగే ఈ కథకు ఈసారి సముద్రాన్ని జోడించాడు దర్శకుడు.

మరింత కొత్త అనుభూతిని అందించడమే కాకుండా, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని వాడి సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు కళ్లుచెదిరే రేంజ్ లో ఉంటాయనే విషయాన్ని తాజా ట్రయిలర్ తో స్పష్టం చేశారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను సాధారణ స్క్రీన్స్ పై కంటే త్రీడీ, 4డీఎక్స్ ఫార్మాట్ లో చూసేందుకు ఎక్కువమంది ఆసక్తిచూపిస్తున్నారు.

Exit mobile version