Site icon HashtagU Telugu

Avatar 2: అవతార్‌ 2 డిజిటల్‌ రిలీజ్‌ డేట్ వచ్చేసింది!

Avatar 2 Digital Release Date Has Arrived!

Avatar 2 Digital Release Date Has Arrived!

యావత్‌ సినీ ప్రపంచాన్ని అలరించిన చిత్రం ‘అవతార్‌ 2’ (Avatar 2). హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కెమెరూన్‌ (james cameron) ఈ విజువల్‌ వండర్‌ సినిమా ను తెరకెక్కించారు. థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 28న ఇది డిజిటల్‌ స్క్రీన్స్‌పై ప్రేక్షకులను అలరించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘అవతార్‌’ (Avatar) టీమ్‌ తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది. మునుపెన్నడూ చూడని విశేషాలను మూడు గంటలపాటు చూసేందుకు సిద్ధంకండి అని పేర్కొంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, యాపిల్‌ టీవీ, ఓటీటీ వేదికల్లోల ఇది స్ట్రీమింగ్‌ కానుంది. 4కె అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ అట్‌మాస్‌ ఆడియోతో రానుంది. తొలుత కొన్ని రోజుల పాటు వీడియో ఆన్‌ డిమాండ్‌ లేదా అద్దె ప్రాతిపదికను ‘అవతార్‌2’ స్ట్రీమింగ్‌ కానుంది.

2009లో విడుదలైన ‘అవతార్‌’కు కొనసాగింపుగా ఈ సినిమా సిద్ధమైంది. తొలి భాగం పండోరా గ్రహంలోని సుంద‌ర‌మైన అట‌వీ, జీవ‌రాశుల ప్రపంచం చుట్టూనే సాగుతుంది. ఈసారి క‌థ‌ని ‘ది వే ఆఫ్ వాట‌ర్’ అంటూ నీటి ప్రపంచంలోకి తీసుకెళ్లాడు జేమ్స్ కామెరూన్‌ (james cameron). గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈసినిమా భారీ వసూళ్లు రాబట్టింది.

Also Read:  Buttermilk: వేసవిలో రోజుకో గ్లాసు మజ్జిగ తాగడం వల్ల చాలా లాభాలున్నాయి!