Avantika Vandanapu : టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి.. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అవార్డు..

టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లిన మన తెలుగు అమ్మాయి అవంతిక వందనపు.. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అరుదైన అవార్డుని అందుకుంది.

Published By: HashtagU Telugu Desk
Avantika Vandanapu Received Special Award From Harvard University

Avantika Vandanapu Received Special Award From Harvard University

Avantika Vandanapu : మన తెలుగు అమ్మాయి అయిన అవంతిక వందనపు.. హాలీవుడ్ గడ్డ పై సత్తా చాటుతుంది. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అవంతిక.. ఆ తరువాత నాగచైతన్య, పవన్ కళ్యాణ్, గోపీచంద్ సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా అవంతిక నటించింది. చివరిగా తెలుగులో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో అవంతిక కనిపించింది. ఆ తరువాత హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతుంది.

అవంతిక ఫ్యామిలీ తెలుగు వారే అయినప్పటికీ.. వాళ్ళు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో అవంతిక అక్కడే తన కెరీర్ ని బిల్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. టాలీవుడ్ లో నేర్చుకున్న నటనా పాఠాలు.. హాలీవుడ్ లో చూపిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. డాన్సర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా హాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతిక.. వెబ్ సిరీస్ తో హాలీవుడ్ లో యాక్టింగ్ కెరీర్ ని మొదలుపెట్టింది.

ఆ తరువాత ‘స్పిన్’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసే ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆ సినిమాతో, వెబ్ సిరీస్‌తో పెద్దగా గుర్తింపు రాలేదు. గత ఏడాది రిలీజైన ‘మీన్ గర్ల్స్’ సినిమాతో అవంతిక పేరు హాలీవుడ్ టు టాలీవుడ్ మారుమోగిపోయింది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన అవంతిక.. తన హాట్ పర్ఫార్మెన్స్ తో అందర్నీ ఫిదా చేసింది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి హాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

ఇక ఇండియా టు అమెరికా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న ఈ నటిని అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ గుర్తించి ఓ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించింది. ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుని అవంతికకు అందించి హార్వర్డ్ యూనివర్సిటీ గౌరవించింది.

ఇక ఈ అవార్డు అందుకున్న తరువాత అవంతిక మాట్లాడుతూ.. “ఈ అవార్డు అందుకున్నందుకు గర్వంగా ఉంది. అయితే ఇది కేవలం నా వర్క్ కి మాత్రమే వచ్చిన అవార్డు మాత్రమే కాదు, బోర్డుర్లు దాటి గ్లోబల్ స్థాయిలో సినిమాలు చేస్తున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఈ అవార్డు గౌరవాన్ని ఇస్తుంది” అంటూ పేర్కొంది. అవంతిక కామెంట్స్ పై తెలుగు ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also read : Singham Again : బన్నీని వదిలేసి.. చరణ్‌పై దాడికి సిద్దమవుతున్న సింగం..

  Last Updated: 16 Apr 2024, 12:25 PM IST