Site icon HashtagU Telugu

Auto Ram Prasad : స్నేహితుల కోసం అద్భుతమైన కథ రెడీ చేస్తున్న ఆటో రాంప్రసాద్..!

Auto Ram Prasad Writting A Story For His Jabardasth Friends Sudigali Sudheer And Getup Srinu

Auto Ram Prasad Writting A Story For His Jabardasth Friends Sudigali Sudheer And Getup Srinu

Auto Ram Prasad జబర్దస్త్ షోతో సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ ముగ్గురు సినిమాల్లో నటిస్తున్నారు. సుధీర్, గెటప్ శ్రీను ఆల్రెడీ లీడ్ రోల్ ఆఫర్లు కూడా అందుకుంటున్నారు. ఆటో రాం ప్రసాద్ మాత్రం జబర్దస్త్ ని ఇంకా వదిలి రాలేదు. అయితే సుధీర్, గెటప్ శ్రీను టీం కి వన్ అండ్ ఓన్లీ రైటర్ ఆటో రాంప్రసాద్. అతని రైటింగ్స్ తోనే ఇన్నేళ్లు స్కిట్స్ చేస్తూ వచ్చారు. సుధీర్, గెటప్ శ్రీను నటులుగా సినిమాలతో బిజీ అవ్వగా ఆటో రాంప్రసాద్ మాత్రం డైరెక్టర్ గా కెరీర్ కొనసాగించాలని చూస్తున్నాడట.

ఇప్పటికే ఆటో రాంప్రసాద్ కూడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. అలా చేస్తూనే స్నేహితులిద్దరి కోసం ఒక అద్భుతమైన కథ రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆటోరాంప్రసాద్ డైరెక్షన్ లో సుధీర్, గెటప్ శ్రీను ఇద్దరు నటిస్తారని తెలుస్తుంది. ఈ విషయాన్ని గెటప్ శ్రీను వెల్లడించాడు.

గెటప్ శ్రీను లీడ్ రోల్ లో రాజు యాదవ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఆటో రాంప్రసాద్ కథ గురించి చెప్పాడు గెటప్ శ్రీను. కొన్నాళ్లుగా కథ మీద రాంప్రసాద్ వర్క్ చేస్తున్నాడని తప్పకుండా మా ఇద్దరిని పెట్టి రాంప్రసాద్ సినిమా చేస్తారని చెప్పుకొచ్చాడు గెటప్ శ్రీను.

Also Read : Game Changer : శంకర్ మార్క్ పెద్ద ఫీస్ట్.. గేమ్ చేంజర్ పై థమన్ కామెంట్స్ తో మెగా ఫ్యాన్స్ ఖుషి..!