Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) దాడి ఘటనతో సినీ పరిశ్రమలో కలకలం రేగింది. అందరూ సైఫ్ గురించి ఆందోళన చెందుతున్నారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సైఫ్ ఇప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డప్పటికీ.. జనాలు మాత్రం అతని గురించి ఆందోళన చెందుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కథ మొత్తం చెప్పాడు. ఆటో డ్రైవర్ ఏం చెప్పాడో తెలుసుకుందాం?
ఆటో డ్రైవర్ ఏం చెప్పాడు?
సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్. తాను ఉత్తరాఖండ్ వాసినని ఆటో డ్రైవర్ చెబుతున్నాడు. భజన్ సింగ్ గత 20 ఏళ్లుగా ఆటో నడుపుతూ నైట్ డ్యూటీ మాత్రమే చేస్తున్నాడు. డ్రైవర్ చెప్పిన ప్రకారం.. ఆ రాత్రి సైఫ్ అలీఖాన్ తన కొడుకు తైమూర్, మరొక వ్యక్తితో కలిసి భవనం గేట్ వెలుపల ఆటోలో కూర్చున్నాడని చెప్పాడు. నటుడితో ఉన్న వ్యక్తులు ఆసుపత్రికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుందని అడిగారని డ్రైవర్ చెప్పాడు.
Also Read: Sanju Samson: సంజూ శాంసన్ నిర్ణయం.. బీసీసీఐ అసంతృప్తి!
లీలావతి ఆసుపత్రికి తరలించారు
ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ తెల్లటి రంగు కుర్తా ధరించాడని, అది పూర్తిగా రక్తంతో తడిసిపోయిందని డ్రైవర్ చెప్పాడు. ఈ సమయంలో వారు తమలో తాము మాట్లాడుకుని లీలావతి ఆసుపత్రికి వెళ్లాలని కోరారు. తనతో పాటు ఆటోలో వెళ్తున్న గాయపడిన వ్యక్తి సైఫ్ అలీఖాన్ అని తనకు తెలియదని డ్రైవర్ చెప్పాడు.
ఆటో దిగి స్ట్రెచర్ తీసుకురావాలని గార్డును కోరగా సైఫ్ గురించి తెలిసిందని, నేను సైఫ్ అలీ ఖాన్ అని ఆయన చెప్పినట్లు ఆటో డ్రైవర్ చెప్పాడు. సైఫ్ భవనం బయట చాలా మంది నిలబడి ఆటో, ఆటో అంటూ అరుస్తున్నారని చెప్పాడు. ఆటోలో అతనితో పాటు ఓ చిన్నారి, ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారని చెప్పాడు. తాను సాయం చేసిన వ్యక్తి సైఫ్ అని తెలియక పోయినా.. ఆ నటుడికి సాయం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు.
జనవరి 16వ తేదీ రాత్రి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ గుర్తుతెలియని వ్యక్తి దొంగతనం నిమిత్తం ప్రవేశించడం గమనార్హం. ఈ క్రమంలో సైఫ్‌పై దొంగ దాడి చేయడంతో గాయపడ్డాడు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ఈ కేసు గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.