Site icon HashtagU Telugu

NTR : ఆ సూపర్ హిట్ సినిమాలో నటించింది ఎన్టీఆర్ కాదని గుర్తుపట్టేసిన ప్రేక్షకులు..

Audience find Ramudu Bheemudu Movie Duel Role Character other than NTR

Audience find Ramudu Bheemudu Movie Duel Role Character other than NTR

ఇప్పుడు సినిమాల్లో డ్యూయల్ రోల్స్(Dual Roles) చేయాలంటే సీజే, వీఎఫ్‌ఎక్స్‌ ద్వారా చాలా తేలిగ్గా చేసేస్తున్నారు. కానీ ఒకప్పుడు స్క్రీన్ పై ఒక పాత్ర కంటే ఎక్కువ పాత్రల్లో కనిపించాలి అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. మొదటిలో ఇలా డ్యూయల్ రోల్ లో కనిపించడానికి డూప్ ని ఉపయోగించేవారు. ఆ తరువాత కెమెరా ట్రిక్, స్ప్లిట్‌ విధానం ఉపయోగిస్తూ వచ్చారు. ఈ స్ప్లిట్‌‌ విధానంలో ‘మాస్క్‌’ వేసి సీన్స్ చిత్రీకరించేవారు. దీని కోసం గెటప్‌ మార్చుకోవాలి. దీంతో చాలా సమయమే పట్టేది. ఒక చిన్న సీన్ తియ్యాలి అన్నా ఒక రోజులో అయ్యేది కాదు.

ఈ సమస్య వలనే ఒక సినిమాలో నటించింది సీనియర్ ఎన్టీఆర్(NTR) కాదని ఇట్టే తెలిసిపోయింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ఎన్టీఆర్ తో రామానాయుడు(Rama Naidu) తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రాముడు-భీముడు’(Ramudu Bheemudu). ఈ సినిమాలో మొదటిసారి ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటించి అలరించారు. కాగా ఈ మూవీలో ఇద్దరు రామారావులు ఒకేసారి స్క్రీన్ పై కనిపించే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అయితే సినిమాలోని లాస్ట్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఎన్టీఆర్ కాల్‌షీట్లు సమస్య వచ్చింది. ఒక్క రోజు కాల్‌షీట్‌ సర్దుబాటు చేయడానికి కూడా ఎన్టీఆర్ దగ్గర డేట్స్ లేవు. అయితే అతి కష్టం మీద ఎన్టీఆర్.. ఒక్క పూట కాల్‌షీట్‌ సర్దుబాటు చేసుకొని వస్తానని చెప్పారు.

అయితే ఆ ఒక్క పుటలో స్ప్లిట్‌ విధానంలో డ్యూయల్ షాట్ చేయాలంటే కష్టం. దీంతో ఆ షాట్ లో డూప్ ని ఉపయోగించాలని అనుకున్నారు. ఇందుకోసం ఆల్రెడీ ఎన్టీఆర్ కి ముందు నుంచి డూప్ గా చేస్తూ వస్తున్న ‘కైకాల సత్యనారాయణ’ని తీసుకు వచ్చారు. లాంగ్ షాట్ లో కెమెరా పెట్టి ఆ సీన్ ని చిత్రీకరించారు. అయితే కైకాల అప్పటికి చాలా సినిమాల్లో నటించడంతో.. ఆయన ఆహార్యం ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అయ్యిపోయింది. దీంతో ఆ సీన్ లో రెండో వ్యక్తి సత్యనారాయణ అని సెకండ్స్ వ్యవధిలోనే ప్రేక్షకులు గుర్తు పట్టేశారట. ఈ విషయాన్ని రామానాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే దానిని ఒక లోపంగా చూపించి ప్రేక్షకులు విమర్శించలేదని రామానాయుడు పేర్కొన్నారు. అదే ఇప్పుడున్న సమయంలో జరిగితే ప్రేక్షకులు ఇట్టే కనిపెట్టి ట్రోల్స్ చేసేవాళ్ళు.

 

Also Read : Sai Pallavi: సాయిపల్లవి ఈజ్ బ్యాక్.. క్రేజీ అప్ డేట్ ఇదిగో