Site icon HashtagU Telugu

Mrunal Thakur : మృణాల్ నుంచి మార్పు కోరుతున్న ఆడియన్స్..!

Mrunal Thakur Watching her Favourite movie

Mrunal Thakur Watching her Favourite movie

Mrunal Thakur బాలీవుడ్ సీరియల్స్ లో నటించి అక్కడ టాలెంట్ చూపించి హిందీ సినిమాల్లో ఛాన్సులు అందుకున్న మృణాల్ ఠాకూర్ అక్కడ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నా తెలుగులో సీతారామం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సౌత్ ఆడియన్స్ అంతా ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అంతా కూడా అమ్మడి ప్రేమలో పడిపోయారు. సీతారామం తో సూపర్ పాపులర్ అయిన మృణాల్ ఆ తర్వాత నానితో హాయ్ నాన్న సినిమాలో నటించింది.

ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక థర్డ్ మూవీగా ఫ్యామిలీ స్టార్ లో నటించింది. విజయ్ దేవరకొండ పరశురాం కలిసి చేసిన ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ ఠాకూర్ లక్ కలిసి వస్తుందని అనుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. మృణాల్ ఠాకూర్ నటించిన 3 సినిమాలు చూస్తే దాదాపు ఒకే తరహా పాత్రలు అనిపిస్తాయి. క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ కావొచ్చు కానీ అన్నీ క్లాస్ పాత్రలనే చేస్తూ వచ్చింది.

ఫ్యామిలీ స్టార్ లో బిలీనియర్ కూతురుగా షాక్ ఇచ్చిన మృణాల్ సీతారామం లో యువరాణిగా నటించింది. ఇక హాయ్ నాన్నలో కూడా పెద్ద ఫ్యామిలీ అమ్మాయిగా నటించింది. 3 సినిమాల్లో 3 పాత్రల్లో నటించిన మృణాల్ మాస్ రోల్ లేదా మిడిల్ క్లాస్ రోల్ చేయాలని ఆడియన్స్ ఆశిస్తున్నారు.

ఎప్పుడు క్లాస్ రోల్స్ చేస్తే బోర్ కొట్టేస్తుంది. మృణాల్ ని డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూడాలని కోరుతున్నారు ఆడియన్స్. అయితే దర్శకులు ఆమెను ఆ పాత్రలకు సంప్రదిస్తున్నారు కాబట్టి అవే చేస్తుంది. సీతారామం తో వచ్చిన ఇమేజ్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న మృణాల్ ఠాకూర్ రాబోయే సినిమాలతో అయినా కొత్తగా ప్రయత్నిస్తుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Naga Chaitanya : హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి నాగ చైతన్య నో ఎందుకు చెప్పాడు..?