Good News Moviegoers : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. !
ప్రత్యేకించి సినిమా హాల్ కు వెళ్లి మూవీ చూసే వారికి ఈ గుడ్ న్యూస్.. !
మూవీ థియేటర్స్ లో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు తగ్గిపోయాయి..
సినిమా హాళ్లలో విక్రయించే ఫుడ్, కూల్ డ్రింక్స్ పై విధించే సర్వీస్ ట్యాక్స్ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.
దీంతో పాప్‌కార్న్, కోలా ధరలు డౌన్ అయ్యాయి.
సినిమా హాళ్లలో ఫుడ్, కూల్ డ్రింక్స్ పై విధించే సర్వీస్ ట్యాక్స్ ను 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే నిర్ణయాన్ని వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ ప్రకటించింది. సినిమా హాళ్ల నిర్వాహకులకు వచ్చే ఆదాయంలో 35 శాతం(Good News Moviegoers) ఫుడ్స్ అండ్ కూల్ డ్రింక్స్ సేల్స్ నుంచే వస్తాయి. అంటే సినిమా హాళ్ల నిర్వాహకులు సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 35 రూపాయలు ఈ సెక్షన్ నుంచే వస్తున్నాయన్న మాట.
Also read : Nepal PM Wife Passes Away: నేపాల్ ప్రధాని భార్య అనారోగ్యంతో కన్నుమూత
కరోనా టైంలో మూవీ థియేటర్స్ మూతపడి అందులోని ఫుడ్ సెక్షన్ లకు ఆదాయం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ బిజినెస్ కు ఊపునివ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫుడ్, కూల్ డ్రింక్స్ పై విధించే సర్వీస్ ట్యాక్స్ ను 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. మహమ్మారి కంటే ముందు మనదేశంలో 9,000 సినిమా స్క్రీన్‌లు ఉన్నాయి. అయితే, వాటిలో చాలా థియేటర్లు కరోనా మహమ్మారిలో అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా మూతపడ్డాయి. సినిమా టిక్కెట్టు, ఆహారాన్ని ప్యాకేజీగా కొనుగోలు చేస్తే, దానిపై వర్తించే విధంగా GSTని వసూలు చేస్తారు.