ఇటీవల రామబాణం మూవీలో నటించిన హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు అయ్యింది. ఐపీఎస్ రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీ కొట్టడం, కాలుతో తన్నడంతో రాహుల్ హెగ్డే డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. డింపుల్‌పై ఐపీసీ సెక్షన్ 353,341,279 కింద కేసు నమోదు అయ్యింది. హీరోయిన్ డింపుల్ హయాతి ఐపీఎస్ రాహుల్ హెగ్డే జర్నలిస్టు కాలనీలో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అపార్ట్‌మెంట్ పార్కింగ్ వద్ద తరచూ ఇలాంటి గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే డింపుల్ హయాతీ కాబోయే భర్త డేవిడ్ తన కారుతో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారుతో ఢీకొట్టగా…డింపుల్ హయతి రాహుల్ హెగ్డే కారును కాలుతో తన్నారు. పలుమార్లు నచ్చచెప్పినా.. డింపుల్ హయాతి తీరులో మార్పు రాకపోవడంతో ఈసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. డింపుల్‌పై ప్రభుత్వఆస్తుల ధ్వంసం చేసినందుకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన టాలీవుడ్ లో చర్చనీయాంశమవుతోంది.
అయితే తనపై నమోదు చేసిన పోలీస్ కేసు, ఐపీఎస్‌తో వివాదం నేపథ్యంలో డింపుల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసలు గొడవ ఏంటీ అన్న విషయాన్ని ప్రస్తావించకుండా వరుస ట్వీట్లు చేశారు. ‘‘అధికారాన్ని వాడి తప్పుల్ని అడ్డుకోలేరు’’, ‘‘అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుల్ని కప్పిపుచ్చలేరు.. సత్యమేవజయతే’’ అంటూ ట్వీట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మొత్తం ఈ వివాదంలో తప్పు ఎవరిది అనేది తేలాలంటే సీసీటీవీ ఫుటేజ్ ఒక్కటే మార్గం. ప్రస్తుతం ఫుటేజ్‌ను విశ్లేషించే పనిలో వున్నారు పోలీసులు. దీనిని బట్టి నేరం ఎవరిదో తేల్చనున్నారు.
Misuse of power doesn’t hide mistakes .. 😂 . #satyamevajayathe
— Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023
Also Read: Busiest Heroine: 7 సినిమాలు, 2 షిప్టులు.. శ్రీలీల బిజీ బిజీ!