Athadu Re Release : ‘అతడు’ మళ్లీ వస్తున్నాడు..బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి సునామే !

Athadu Re Release : మహేశ్ స్టైల్ పంచ్ లు, బ్రహ్మీ కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది

Published By: HashtagU Telugu Desk
Athadu Re Release

Athadu Re Release

సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో ‘అతడు’ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 2005 లో వచ్చిన ఈ సినిమాలో పార్థుగా మహేశ్ సెటిల్డ్ ప్ఫరామెన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మహేశ్ స్టైల్ పంచ్ లు, బ్రహ్మీ కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. బుల్లి తెరపై అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాగా అతడు పేరిట రికార్డ్ కూడా ఉంది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత అతడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు వస్తున్నాడు.

Upasana : ఈ నియామకం నాకెంతో గౌరవాన్నిచ్చింది.. సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన కృతజ్ఞతలు

టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. మహేశ్ ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలైన ఒక్కడు, మురారి, ఖలేజా రీరిలీజ్ లో భారీ వసూళ్లు రాబట్టాయి. ఈ నేపధ్యంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు 50వ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న అతడు వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇన్నేళ్ల తర్వాత కూడా అతడు క్రేజే ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అతడు బుకింగ్స్ పేరుకు తగ్గట్టే సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల కంటే అతడు బుకింగ్స్ బాగున్నాయంటే అతడు ట్రెండ్ ఎలా ఉందని. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అతడు సాలిడ్ బుకింగ్స్ రాబడుతోంది. ఘట్టమనేని అభిమానులతో పాటు ప్రేక్షుకులు కూడా ఈ సినిమాను 70MM స్క్రీన్ పై చూడాలని ఎదురుచూస్తున్నారు. నైజాంలో ఈ సినిమాను ఏషియన్ విడుదల చేస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో మంచి ధరకు కొనుగోలు చేసారు బయ్యర్స్. ఒక వైపు బాబు బర్త్ డే మరోవైపు వీకెండ్, సినిమాలు ఏవి లేకపోవడం అతడు రీరిలీజ్ లో రికార్డు స్థాయి నంబర్స్ రాబట్టే అవకాశం ఉంది.

  Last Updated: 04 Aug 2025, 02:34 PM IST