Aswani Dutt : కల్కి సెకండ్ పార్ట్ ఫై కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత అశ్విని దత్

ఇప్పటికే సెకండ్ పార్ట్కు సంబంధించిన 60శాతం షూటింగ్ పూర్తయినట్లు అశ్విని దత్ తెలిపారు

  • Written By:
  • Publish Date - June 29, 2024 / 05:26 PM IST

కల్కి (Kalki) సెకండ్ పార్ట్ ఫై కీలక అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో మరింత జోష్ నింపారు నిర్మాత అశ్విని దత్ (Aswani Dutt). ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ ఇలా ఎంతో మంది ఈ మూవీ లో నటించి మెప్పించగా రాజమౌళి , సల్మాన్ దుల్కర్ , విజయ్ దేవరకొండ , వర్మ వంటి వారు ప్రత్యేక పాత్రలో కనిపించగా..భారీ బడ్జెట్ తో వైజయంతి బ్యానర్ ఫై అశ్విని దత్ నిర్మించారు. మొదటి ఆటతోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడం తో అభిమానులు , మేకర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కలెక్షన్లు కూడా గత రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో నిర్మాత అశ్వనీదత్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సెకండ్ పార్ట్కు సంబంధించిన 60శాతం షూటింగ్ పూర్తయినట్లు అశ్విని దత్ తెలిపారు. కొన్ని మేజర్ పోర్షన్స్ షూట్ చేయాల్సి ఉందని , రిలీజ్ తేదీని ఇంకా ఫిక్స్ చేయలేదని పేర్కొన్నారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడం తో సెకండ్ పార్ట్ ఫై అంచనాలు పెరిగిపోయాయి. ఈ 2nd పార్ట్ కూడా త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని కోరుకుంటున్నారు.

ఇక ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే..

మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5 కోట్లు వచ్చాయని మూవీటీమ్ అఫీషియల్​గా ప్రకటించింది. దీంతో తొలి రోజే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. గురువారం(జూన్ 27) వర్కింగ్ డే అయినప్పటికీ ఈ స్థాయి భారీ వసూళ్లు అందుకోవడానికి కారణం ఆ సినిమాకు ఉన్న హైపే కారణం. దీనికి తోడు తొలి రోజు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ లెక్కన రెండో రోజు శుక్రవారం కూడా భారీగానే వసూళ్లు వస్తాయని అనుకున్నారు కానీ అనుకున్నంత రాలేదు. మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.95.3 కోట్ల వరకు ఉన్నాయి. కానీ రెండో రోజు ఇండియాలో రూ.50 కోట్ల వరకు నెట్​ వసూళ్లే వచ్చాయి. ఇందులో తెలుగు నుంచి రూ.24.65 కోట్లు, తమిళం(రూ.3.5 కోట్లు), హిందీ(రూ.20.5 కోట్లు), కన్నడ(0.3 కోట్లు), మలయాళం(రూ.2 కోట్లు) వచ్చినట్లు పేర్కొంది. అయితే ఎలాగో వీకెండ్ వచ్చింది కాబట్టి శని, ఆదివారాల్లో మళ్లీ ఈ కలెక్షన్లు రెట్టింపు అవ్వొచ్చని అంతా అంచనా వేస్తున్నారు.

Read Also : Pawan Kalyan : కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ..