రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వేణు స్వామి. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి లేనిపోని వివాదాలను కాంట్రవర్సీలను కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల అభిమానులు వేణు స్వామి పై దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు. కాగా ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది.
వేణు స్వామి చేసే వ్యాఖ్యలు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు వేణు స్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం వివాదంగా మారడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ తో సోషల్ మీడియాలో నిలిచే వేణు స్వామి తాజాగా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ విషయంలో వార్తల్లో నిలిచారు. ఆయన భార్య వీణా శ్రీవాణి భర్త వేణు స్వామితో కలిసి ఒక ఫన్నీ వీడియోను చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. మిర్చి సినిమాలోని ప్రభాస్ అనుష్క శెట్టి మధ్య సాగే ఎలాంటి అమ్మాయి కావాలేంటి అనే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది.
వేణుస్వామి కూడా భార్యతో అదే సీన్ ను ఫన్నీగా చేశారు. ఆ వీడియో ప్రభాస్ వాయిస్ ను ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. వేణు స్వామి ప్రభాస్ పై ఆందోళనకరమైన వ్యాఖ్యలు చేస్తుండగా.. ఆయన భార్య మాత్రం ప్రభాస్ డైలాగ్స్ తో రీల్స్ చేస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. మీ ఇంట్లోనే డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారంటూ పలువురు అభిమానులు ఆ వీడియోపై స్పందిస్తున్నారు. ఆ వీడియో పై అందించిన కొంతమంది మాది వరకు ప్రభాస్ పై విమర్శలు గుప్పించావు ఇప్పుడు అదే ప్రభాస్ వీడియో వాడుతున్నావు సిగ్గు లేదా అంటూ కామెంట్ చేస్తున్నారు.