Ask Urvashi : మరోసారి పవన్ కళ్యాణ్ కు ‘జై’ కొట్టిన ఊర్వశి రౌతేలా

ఊర్వశి రౌతేలా..మరోసారి పవన్ కళ్యాణ్ కు జై కొట్టి అభిమానులను ,జనసేన శ్రేణులను సంతోష పెట్టింది

Published By: HashtagU Telugu Desk
Ask Urvashi- Urvashi Rautela chooses Pawan Kalyan

Ask Urvashi- Urvashi Rautela chooses Pawan Kalyan

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా..మరోసారి పవన్ కళ్యాణ్ కు జై కొట్టి అభిమానులను ,జనసేన శ్రేణులను సంతోష పెట్టింది. వాల్తేర్ వీరయ్య మూవీలో ఐటెం సాంగ్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ..ప్రస్తుతం వరుస టాలీవుడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్రో మూవీ లో ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఓ సాంగ్ లో కనిపించి అలరించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని..బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఈ క్రమంలో ఊర్వశి రౌతేలా..ట్విట్టర్‌లో #AskUrvashi అంటూ అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ అభిమాని మీరు YS Jagan లేదా Pawan Kalyan వీరిలో ఎవరో ఒకరిని ఎంచుకోమని అడిగారు. దీనికి ఏమాత్రం మొహమాటం లేకుండా PSPK (Power Star Pawan Kalyan) అంటూ సమాధానం ఇచ్చింది. ఊర్వశీ సమాధానం తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మొన్నటికి మొన్న బ్రో రిలీజ్ సందర్బంగా ట్విట్టర్ లో “మా చిత్రం #BroTheAvatar జులై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది. చనిపోయిన తర్వాత తన తప్పులను సరిదిద్దుకోవడానికి ఓ వ్యక్తి రెండవ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేదే స్టోరీ.’’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తర్వాత వైసీపీ అభిమానులు..పలువురు నెటిజన్లు ఊర్వశీ ఫై విమర్శలు చేసారు. ఏపీ సీఎం ఎవరో కూడా తెలియదా ..”పవన్ ఎమ్మెల్యేనే కాదు ఇక సీఎం అంట” అంటూ ఎప్పటిలానే పవన్‌పై సెటైర్లు వేశారు. దీంతో ఆమె తన తప్పు తెలుసుకొని మరో ట్వీట్ చేసారు. ఊర్వశీ పవన్ కళ్యాణ్ ను సీఎం అని చేసిన ట్వీట్ ఫై ఇంకా చర్చ నడుస్తుండగానే..ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ ను ఎంచుకోవడం తో మరోసారి అమ్మడి పేరు వైరల్ గా మారింది.

Read Also : Manchu Manoj: చంద్రబాబుతో మంచు మనోజ్ భేటీ.. టీడీపీ లో చేరుతారా?

  Last Updated: 31 Jul 2023, 06:30 PM IST