Site icon HashtagU Telugu

OTT: ఓటీటీలో ఆకట్టుకుంటున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. మనుషులను తినే నరమాంస భక్షకులు నగరానికి వస్తే!

Ott

Ott

ఈ మధ్యకాలంలో క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఎక్కువగా సినిమాలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇదే కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదల అయ్యి మంచి విజయం సాధించాయి. అయితే క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఎన్ని వచ్చినా కూడా ప్రేక్షకులు వాటిని బాగా హిట్ చేస్తున్నారు. అలాంటి సినిమాలు వెబ్ సిరీస్ ల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాగా అలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమా గత ఏడాది థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. అయితే ఈ సూపర్ హిట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. అశ్విన్ బాబు హీరోగా నటించిన హిడింబ.

2023 జులై 20న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీకి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోనూ హిడింబ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడీ సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా హిడింబ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం తెలుగు వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ ఓటీటీలో హిడింబ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి. ఇకపోతే హిడింబ సినిమా విషయానికి వస్తే.. అనిల్‌ కన్నెగంటి తెరకెక్కించిన ఈ సినిమాలో నందితా శ్వేతా హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోదిని, రఘుకంచె తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఏకే ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించి హిడింబ సినిమాకు అనిల్‌ సుంకర సమర్పకుడిగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్ లో కొందరు అమ్మాయిలు వరుసగా కిడ్నాప్‌కు గురవుతారు. దీని వెనక గల మిస్టరీని ఛేదించేందుకు స్పెషల్‌ ఆఫీసర్లుగా నందిత, అశ్విన్ బాబు రంగంలోకి దిగుతారు. అదే సమయంలో హిడింబ అనే ఒక తెగకు చెందిన ఒక వ్యక్తి జనారణ్యంలోకి వచ్చాడని తెలుస్తుంది. మరి తప్పిపోయిన మహిళలకు హిడింబ తెగకు సంబంధమేమిటి? కిడ్నాప్ అయినా మహిళల వెనుక హిడింబా హస్తం ఉందా ఈ విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. కాగా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.