Site icon HashtagU Telugu

Ashwin Babu : పాన్ ఇండియా హీరోగా మారబోతున్న అశ్విన్ బాబు..

Ashwin Babu

Ashwin Babu

Ashwin Babu : ఓంకార్(Omkar) తమ్ముడుగా సినీ పరిశ్రమలోకి వచ్చిన అశ్విన్ బాబు రాజుగారి గది మూడు సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇటీవల హిడింబ సినిమాతో వచ్చి మెప్పించాడు. ప్రతిసారి సస్పెన్స్ థ్రిల్లింగ్ కథలతో కొత్తగా ట్రై చేస్తున్న అశ్విన్ బాబు ఈ సారి కూడా మరో కొత్త కథతో రాబోతున్నాడు.

గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘శివం భజే'(Shivam Bhaje). తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అశ్విన్ ఒంటి కాలి మీద నిలబడి ఒంటిచేత్తో మనిషిని పైకెత్తి రౌద్ర రూపంలో ఉండగా వెనక అఘోరాలు, త్రిశూలాలు, చీకట్లో కాగడాలు, దేవుడి విగ్రహం ఉన్నాయి. పోస్టర్ చూస్తుంటేనే సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా హైపర్ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక పోస్టర్ లాంచ్ సందర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక వైవిధ్యమైన కథతో మా గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాణంలో అశ్విన్ బాబు హీరోగా ఈ ‘శివం భజే’ సినిమాని నిర్మిస్తున్నాం. టైటిల్, ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టవల్-24 లో బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు అందుకున్న దాశరథి శివేంద్ర ఈ సినిమాకి అదిరిపోయే విజువల్స్ ఇచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జూన్ లో విడుదల చేయబోతున్నాం అని తెలిపారు.

 

Also Read : Celebrities Vote : చిరు, చెర్రీ, ఎన్టీఆర్, మహేష్‌బాబు ఓటు వేసే పోలింగ్ కేంద్రాలివే

Exit mobile version