Site icon HashtagU Telugu

Ashu Reddy : సమంతను దించేసిన అషు రెడ్డి.. ఇద్దరు ఆ విషయంలో అస్సలు తగ్గట్లేదు..!

Ashu Reddy Same Like As Samantha In Latest Photoshoot

Ashu Reddy Same Like As Samantha In Latest Photoshoot

Ashu Reddy జూనియర్ సమంతగా పాపులర్ అయిన అషు రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా ఛాన్స్ తెచ్చుకుంది. ఆ సీజన్ లో అమ్మడు చేసిన హడావిడికి సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంది. ఇక ఆఫ్టర్ బిగ్ బాస్ అమ్మడి రచ్చ తెలిసిందే. సమంతని డిటో దించేస్తూ అషు రెడ్డి చేసే ఫోటో షూట్స్ అటు అషు ఫ్యాన్స్ కి ఇటు సమంత ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.

ఆమధ్య వరుస గ్లామర్ షోతో రచ్చ రచ్చ చేసిన అషు ఈమధ్య కాస్త జోరు తగ్గించిందని అనిపించగా మళ్లీ అమ్మడు తన గ్లామర్ ట్రీట్ మొదలు పెట్టింది.

ఆమధ్య ఆర్జీవితో చేసిన ఒక బోల్డ్ ఇంటర్వ్యూ అషు రెడ్డి కి బోల్డ్ ఇమేజ్ తీసుకు రాగా సోషల్ మీడియాలో ఆమె విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొన్నది. ఇదిలాఉంటే అషు రెడ్డి లేటెస్ట్ లుక్ చూసిన వారెవరైనా అర్రె సమంత ని దించేసిందిగా అనేస్తారు. బ్లాక్ డ్రెస్ లో అందాలను ప్రదర్శిస్తూ అషు రెడ్డి అచ్చం సమంతలానే కనిపిస్తుంది.

ముఖ్యంగా అషు రైట్ ప్రొఫైల్ ఫోటో చూస్తే అది సమంతనా అషునా అని కనిపెట్టడం కష్టం. ఈమధ్య స్లిం గా మారి తన ఫ్యాన్స్ ని మరింత ఆకట్టుకుంటుంది అషు రెడ్డి. సమంత, అషు ఇద్దరు వేరు వేరు అయినా ఇద్దరు మాత్రం ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో అస్సలు వెనక్కి తగ్గరు.

జూనియర్ సమంతగా అషు రెడ్డి కూడా తన మార్క్ గ్లామర్ షోతో ఆడియన్స్ ని అలరిస్తుంది. అమ్మడు సోషల్ మీడియాలో ఇలా ఫోటో షేర్ చేస్తే చాలు అలా వైరల్ గా మారిపోతుంది.