Ashish దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన ఆశిష్ రెడ్డి మొదటి సినిమా రౌడీ బోయ్స్ జస్ట్ ఓకే అనిపించుకుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమాలో అనుపమ గ్లామర్ షో.. లిప్ లాక్స్ బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ఆ సినిమా తర్వాత సెకండ్ మూవీ సెట్స్ మీద ఉండగా ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే మరో సినిమా లైన్ లో పెట్టాడు ఆశిష్ రెడ్డి.
ప్రస్తుతం ఆశిష్ సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అరుణ్ అనే నూతన దర్శకుడితో లవ్ మీ అంటూ మరో యూత్ ఫుల్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. వారసుడిని హీరోగా నిలబెట్టేందుకు దిల్ రాజు భారీగానే ప్లాన్ చేస్తున్నాడని అర్ధమవుతుంది.
ముందు యూత్ సినిమాలతో ఆడియన్స్ కు దగ్గర చేస్తూ ఆ తర్వాత మంచి మాస్ మసాలా సినిమాతో యాక్షన్ హీరో ఇమేజ్ తీసుకు రావాలని చూస్తున్నారు. ఎలాగు బ్యానర్ తమదే కాబట్టి ఒక మంచి కమర్షియల్ హిట్ కథ వస్తే దాన్ని హోల్డ్ చేసి ఆశిష్ కోసం దాచి పెట్టాలని చూస్తున్నారు. మరి దిల్ రాజు ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయన్నది చూడాలి. ఈమధ్యనే హీరోగా తెరంగేట్రం చేసిన ఆశిష్ అప్పుడే ఒక ఇంటి వాడయ్యాడు. పెళ్లి తర్వాత కెరీర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలన్న ముందు చూపుతోనే ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
Also Read : Dhanush Rayan First Look : ధనుష్ రాయన్ లుక్ చూశారా..?