టాలీవుడ్ చిత్రసీమ ప్రముఖుల ఇళ్లలో వరుస పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. రెండు రోజుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) పెళ్లి పీటలు ఎక్కబోతుండగా..మరికొంతమంది పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్ (Venkatesh) రెండో కూతురు హయవాహిని ఎంగేజ్ మెంట్ రీసెంట్ గా జరుగగా..మార్చి లో పెళ్లి వేడుక జరగబోతుంది. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి (MM Keeravani) అబ్బాయి శ్రీసింహకు ప్రముఖ నటుడు మురళీమోహన్ మనుమరాలు రాగతో పెళ్లి జరగబోతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. దిల్ రాజు సోదరుడు అయిన శిరీష్ కుమారుడు, హీరో ఆశిష్ రెడ్డి (Ashish Reddy Marriage) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడట. రౌడీ బాయ్స్ సినిమాతో గతేడాది తెలుగుతెరకు పరిచయమయ్యాడు. కానీ ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆశిష్ సెల్ఫిష్ చిత్రంతో రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పాడని సమాచారం.
ఏపీకి చెందిన ఒక వ్యాపారవేత్త ఇంటికి శిరీష్ అల్లుడు కాబోతున్నాడు. డిసెంబర్లో వీరి నిశ్చితార్థం జరుగుతుందని వచ్చే యేడాది ఫిబ్రవరి 14న జైపూర్ లో పెళ్లి జరుగుతుందని సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవలే దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి కన్నుమూయగా..ఆయన చనిపోయిన ఏడాదిలోపే ఇంట్లో శుభకార్యం చేయాలని పెళ్లి తేదీని ఫిక్స్ చేశారట. ఆగస్టులోనే పెళ్లి జరగాల్సింది కానీ ఇరు కుటుంబాల మధ్య మాటలు జరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేశారు. అందుకే పెళ్లిని ఫిబ్రవరి కి వాయిదా వేసినట్లు సమాచారం. ఇక ఈ పెళ్ళికి రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తుంది.
Read Also : AP Politics: వైసీపీ పొలిటికల్ థ్రిల్లర్, చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్