Site icon HashtagU Telugu

Ashish Reddy Love Me : లవ్ మీ అంటున్న ఆశిష్.. దెయ్యంతో లవ్వాట ఎలా ఉంటుందో..?

Ashish Reddy Love Me Motion Poster Released

Ashish Reddy Love Me Motion Poster Released

Ashish Reddy Love Me దిల్ రాజు ఇంటి వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా మొదటి సినిమా రౌడీ బాయ్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా పర్వాలేదు అనిపించగా రెండో సినిమా సెల్ఫిష్ తో వస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే తన థర్డ్ సినిమా అనౌన్స్ మెంట్ తో వచ్చాడు ఆశిష్. ఈసారి లవ్ మె అంటూ ఒక థ్రిల్లర్ లవ్ స్టోరీతో వస్తున్నాడు.

ఈ సినిమాను అరుణ్ భీమవరపు డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు బ్యానర్ లో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డు, నాగ మల్లిడి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బేబీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి లేటెస్ట్ గా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ తోనే సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూపించారు.

దెయ్యంతో లవ్వాట చేస్తున్న ఆశిష్ లవ్ మీ అంటూ అతను దెయ్యాన్ని అడుగుతాడా.. లేదా దెయ్యమే అతన్ని అడుగుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా గురించి దిల్ రాజు చెబుతూ ఆర్య టైం లో కథ విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అదే కొత్త ఫీలింగ్ ఈ సినిమా కథ విన్నప్పుడు కలిగిందని చెప్పారు. మరి ఆశిష్ లవ్ మీ ఎలా ఉండబోతుందో చూడాలి. బేబీ తర్వాత వరుస క్రేజీ సినిమాలు చేస్తున్న వైష్ణవి చైతన్యకు ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు.