శర్వానంద్ సరసన ఆషికా రంగనాథ్

Ashika Ranganath కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన నటి ఆషికా రంగనాథ్ టాలీవుడ్‌లో నెమ్మదిగా కానీ బలంగా తన స్థానాన్ని స్థిరపరుస్తోంది. ‘అమిగోస్’తో తెలుగులోకి అడుగుపెట్టిన ఆమెకు నా సామి రంగ సంక్రాంతి సూపర్ హిట్‌తో మంచి గుర్తింపు లభించింది. తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో మరో హిట్టు అందుకున్న ఆమె శర్వానంద్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. […]

Published By: HashtagU Telugu Desk
Ashika Ranganath

Ashika Ranganath

Ashika Ranganath కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన నటి ఆషికా రంగనాథ్ టాలీవుడ్‌లో నెమ్మదిగా కానీ బలంగా తన స్థానాన్ని స్థిరపరుస్తోంది. ‘అమిగోస్’తో తెలుగులోకి అడుగుపెట్టిన ఆమెకు నా సామి రంగ సంక్రాంతి సూపర్ హిట్‌తో మంచి గుర్తింపు లభించింది. తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో మరో హిట్టు అందుకున్న ఆమె శర్వానంద్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నఆషికా రంగనాథ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కన్నడలో ‘క్రేజీ బాయ్’తో హీరోయిన్‌గా పరిచయమైన ఆషికా తొలి సినిమాతోనే యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ అక్కడ క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథకు అవసరమైన పాత్రల్లోనూ సహజంగా మెప్పించగల నటిగా ఆమెకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ విజయమే ఆమెకు ఇతర భాషల్లో అవకాశాల తలుపులు తెరిచింది.

తెలుగులో ఆషికా ఎంట్రీ ‘అమిగోస్’ సినిమాతో జరిగింది. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్ కాకపోయినా ఆషికా నటనకు మాత్రం మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘నా సామి రంగ’. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి సూపర్ హిట్‌గా నిలిచి, ఆషికాకు తెలుగులో బలమైన గుర్తింపునిచ్చింది. సంప్రదాయ లుక్‌లోనూ, గ్లామర్ పాత్రల్లోనూ ఆమె సహజత్వం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇదే ఊపులో ఆమె రవితేజతో కలిసి నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ సంక్రాంతికి వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఆషికా మరోసారి టాలీవుడ్‌లో తన ఉనికిని చాటింది. అలాగే చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’లోనూ కీలక పాత్రలో కనిపించనుండటం ఆమె కెరీర్‌కు మరో ప్లస్‌గా మారింది. ఈ చిత్రం సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశముందని సమాచారం.

ఇదిలావుంటే, ఆషికా డైరీలోకి తాజాగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వచ్చి చేరిందనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. యంగ్ స్టార్ శర్వానంద్ కథానాయకుడిగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న సినిమాలో ఆషికా హీరోయిన్‌గా ఎంపికైందట. ఈ సినిమా మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని, వచ్చే సంక్రాంతికి విడుదల లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటివరకూ సీనియర్ హీరోలతో జతకట్టిన ఆషికా, తొలిసారి యంగ్ స్టార్ శర్వానంద్‌తో జతకట్టనుండటం విశేషం. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజా సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్టు అందుకున్న శర్వానంద్.. సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతూ శ్రీను వైట్ల డైరెక్షన్లో తాను నటిస్తోన్న మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇక ఆషికా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. “నన్ను గౌరవించే వ్యక్తి కావాలి. నా కెరీర్‌ను అర్థం చేసుకుని, నటనపై ఉన్న నా ప్యాషన్‌ను ప్రోత్సహించే మనసుండాలి” అని ఆమె స్పష్టం చేసింది. లైఫ్ పార్ట్‌నర్ విషయంలో లుక్స్ కంటే వ్యక్తిత్వం, మెంటాలిటీ, నిజాయితీ, బాధ్యత చాలా ముఖ్యమని చెప్పిన ఆషికా, కుటుంబ విలువలను గౌరవించే వ్యక్తి కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కెరీర్‌లో బిజీగా ఉన్నప్పటికీ, జీవితంపై ఆమెకు ఉన్న క్లారిటీ అభిమానుల్లో మరింత గౌరవాన్ని తెచ్చిపెడుతోంది.

  Last Updated: 19 Jan 2026, 03:02 PM IST