Asha Sharma : ‘ఆదిపురుష్’ నటి కన్నుమూత..శోకసంద్రంలో బాలీవుడ్

చివరిసారిగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో శబరి పాత్ర పోషించింది

Published By: HashtagU Telugu Desk
Asha Sharma Dies

Asha Sharma Dies

బాలీవుడ్ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా శర్మ (Asha Sharma)(88) వృద్ధాప్య సమస్యలతో ఆదివారం కన్నుమూశారు. 40 ఏళ్లుగా హిందీలో అనేక చిత్రాలు, టీవీ సీరియళ్లలో నటించిన ఈమె.. చివరిసారిగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో శబరి పాత్ర పోషించింది. ధర్మేంద్ర, హేమామాలిని నటించిన ‘దో దిశాయీన్’ మూవీలో ఆశా శర్మ నటనకు ప్రశంసలు దక్కాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తల్లి, అమ్మమ్మ పాత్రలతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. వెండితెరపై మఝేకుచ్ కెహనా హై, ప్యార్ తో హీనా హో థా, హమ్ తుమ్హారే హై సనమ్ లాంటి సీరియల్స్ లో నటించి పేరు తెచ్చుకుంది. చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఈమె మరణ వార్తను…సినీ, టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధికారిక ‘ఎక్స్‌’ వేదికగా తెలిపింది. 88 సంవత్సరాల వయసులో ఆశా శర్మ తుదిశ్వాస విడిచారని, పరిశ్రమ మరో స్టార్‌ను కోల్పోయిందని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి సంతాపం ప్రకటించింది. ఆమె మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Read Also : PAK vs BAN: క్రికెటర్ గొప్ప మనస్సు, బంగ్లాదేశ్ వరద బాధితులకు భారీ సాయం

  Last Updated: 25 Aug 2024, 08:36 PM IST